Site icon NTV Telugu

Israel: గాజాపై యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అమెరికా మరో సాయం!

Us Isriel

Us Isriel

గాజా, సిరియాపై ఇజ్రాయెల్‌ బాంబులతో విరుచుకుపడుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా.. మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు బాంబుల సాయం చేసేందుకు ముందు కొచ్చింది. ఓ వైపు గాజాలోని పరిస్థితుల్ని చూసి అయ్యో.. పాపం అంటూనే అమెరికా మాత్రం ఇజ్రాయెల్‌కు బాంబుల సాయం చేస్తూనే ఉంటుంది. తాజాగా 2 వేల బాంబులను సాయం చేసినట్లుగా తెలుస్తోంది. కొత్త ఆయుధ ప్యాకేజీలో భాగంగానే ఈ ఆయుధాలను సరఫరా చేసినట్లుగా సమాచారం. రెండు వేలకు పైగా బాంబులు, ఫైటర్‌ జెట్‌లను సరఫరా చేసినట్లుగా అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Viral Video : కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతున్నారా? ఇది చూస్తే జన్మలో తాగరు..

గాజాపై ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న మారణహోమాన్ని ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతటి ఘోరమైన పరిణామాలను చూస్తున్నప్పటికీ తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు మత్రం యుద్ధంలో సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. తాజాగా కొత్త ఆయుధ ప్యాకేజీలో భాగంగా బాంబులను అందించింది.

ఇది కూడా చదవండి: IT Jobs: భారతీయులకు అనుకూలంగా మా ఉద్యోగాలు తీసేశారు.. అమెరికన్ టెక్కీల ఆరోపణ..

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌కు ఆయుధాల బదిలీపై అమెరికా మాత్రం స్పందించలేదు. వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. గతేడాది అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ సైనికులు మారణహోమం సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకూ 32 వేల మంది వ్యక్తులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Malavika Manoj: గుండెల్ని పిండేసిన హీరోయిన్ ను తెలుగులో దింపుతున్నారు

 

Exit mobile version