Malavika Manoj Entering tollywood with Oh Bhama Ayyo Rama: ఈ మధ్యకాలంలో జో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ మాళవిక మనోజ్. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ మలయాళ భామ చేసింది మూడే మూడు సినిమాలు ప్రకాశం పారక్కట్టే అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత నయాది అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత జో అనే సినిమాలో నటించి ఒక్కసారిగా ప్రేక్షకులను గుండెల పిండేసేలా నటించి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. సుహాస్ హీరోగా నటిస్తున్న ఓ భామ అయ్యో రామ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా షూటింగ్, పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభమయ్యాయి.
O Bhama Ayyo Rama: సుహాస్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న ‘నువ్వు నేను’ అనిత..!
విఆర్ట్స్అండ్ చిత్రలహరి టాకీస్ పతాకంపై హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లు రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ గోదాల దర్శకుడు. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వగా దర్శకుడు వశిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో దర్శకుడు కొలను శైలేష్ బౌండెడ్ స్కిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ఇక టైటిల్ పోస్టర్‌ను దర్శకులు విజయ్ కనకమేడల,కిషోర్ తిరుమల, నిర్మాత సుదర్శన్ రెడ్డి, ఆవిష్కరించారు. సుహాస్, మాళవిక మనోజ్, అనిత హస్సా నందని, అలీ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా మణికందన్ వ్యవహరిస్తున్నారు. రథన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూట్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈ ఓపెనింగ్ లో ప్రముఖ హాస్యనటుడు అలీ, సినిమాటోగ్రాఫర్ మణికందన్, సంగీత దర్శకుడు రథన్, ఆర్ట్ దర్శకుడు బ్రహ్మా కడలి, కో ప్రొడ్యూసర్ ఆనంద్ గడగోని తదితరులు పాల్గొన్నారు.