Ameesha patel : నటి అమిషా పటేల్ కు షాక్ ఇచ్చిన రాంచి సివిల్ కోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అమిషా పటేల్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన కహో నా ప్యార్ హై సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకీ పరిచయం అయింది.ఆ తరువాత బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అలాగే తెలుగులోకీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా భారీ విజయం సాధించింది. దీనితో ఈ భామ తెలుగులో బాగా పాపులర్ అయింది. బద్రి సినిమా తరువాత తెలుగులో నాని,నరసింహుడు మరియు పరమవీరచక్ర లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో నటిస్తూనే తెలుగు, తమిళ్ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది.హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కొన్ని కారణాల వల్ల చాలా కాలం పాటు ఈ భామ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవల సినిమాలకు మళ్ళీ రీ ఎంట్రీ కూడా ఇచ్చింది.
కాగా ఆ మధ్య అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త అయిన అజయ్ కుమార్ సినిమా నిర్మిస్తానంటూ తన దగ్గర నుంచి రూ. 2.5కోట్లు అమీషా పటేల్ తీసుకున్నారని. ఆ తర్వాత సినిమా పూర్తిచేయకపోగా తన డబ్బులు తిరిగి ఇవ్వలేదని పేర్కొంటు రాంచీలోని సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు..ఈ కేసుపై రాంచీ కోర్టులో పలుమార్లు విచారణ కూడా జరిగింది..చెక్ బౌన్స్ కేసులో రాంచి సివిల్ కోర్టులో ఈ భామ లొంగిపోయింది. తర్వాత ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అజయ్ కుమార్ అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు కలిపి మొత్తం రూ.3 కోట్లు ఇప్పించాలని కోర్టులో పిటీషన్ కూడా వేశారు. పిటిషనర్ అజయ్ కుమార్ సింగ్ తరుపున సాక్షిగా కంపెనీ మేనేజర్ టింక్ సింగ్ విచారణకు హాజరు కాగా, అమీషా పటేల్ తరుపు న్యాయవాది హాజరు కాలేదు.. దీంతో ఆమె తన న్యాయవాది కోసం కొంత సమయం కోరగా జ్యుడిషియల్ మెజిస్ర్టేట్ డీఎన్ శుక్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు అమీషా పటేల్ కి కోర్టు రూ.500 జరిమానా కూడా విధించింది. తదుపరి విచారణ ఆగస్టు 7కి వాయిదా వేసినట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!