NTV Telugu Site icon

Ameesha Patel : ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉండటం వల్ల నా కెరీర్ నాశనమైంది..

Whatsapp Image 2023 07 04 At 2.50.52 Pm

Whatsapp Image 2023 07 04 At 2.50.52 Pm

అమీషా పటేల్‌ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో వరుసగా స్టార్ హీరోల సినిమాల లో నటించింది.. మహేష్‌ బాబు,ఎన్టీఆర్‌,బాలకృష్ణ మరియు పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌ హీరోలతో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమీషా పటేల్ బాలీవుడ్ లో వరుస సినిమాల లో నటిస్తుంది.రీసెంట్ గా ‘గదర్‌ 2 సినిమా లో నటించింది..ఈ సినిమాలో సన్నీడియోల్ కు జోడిగా అమీషా పటేల్ నటించింది. ఈ సినిమా 1971లో ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో రూపొందింది.రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల కానుంది.ఇదిలా ఉండగా బాలీవుడ్‌ నిర్మాత మరియు డైరెక్టర్‌ విక్రమ్ భట్‌తో రిలేషన్‌షిప్‌ వల్ల తన కెరీర్‌ నాశనం అయిందని ఆమె చెప్పుకొచ్చింది.. దాని వల్ల ఒక దశాబ్దానికి పైగా మగవారికీ దూరంగా ఉంటూ వస్తున్నానని ఆమె తెలిపింది.

అమీషా,విక్రమ్ విడిపోవడానికి ముందు చాలా సంవత్సరాలు డేటింగ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే.బాలీవుడ్‌ నటి అయిన సుస్మితా సేన్‌ తో ప్రేమాయణం నడిపిన విక్రమ్‌ ఆమెతో విడిపోయిన వెంటనే అమీషా పటేల్‌తో డేటింగ్ ప్రారంభించాడు. వారిద్దరూ అంకహీ సినిమా సమయం లో డేటింగ్ ప్రారంభించారు. కానీ తదుపరి చిత్రం 1920 సినిమా విడుదలకు ముందే వారు విడిపోయినట్లు తెలుస్తుంది.విక్రమ్‌తో ఉన్న రిలేషన్ తన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో అమీషా ఇలా తెలిపింది. ‘ఈ పరిశ్రమలో, నిజాయితీకి అస్సలు విలువ లేదు. నేను ఎంతో నిజాయితీ గా ఉన్నాను. కానీ నేను ఎవరినైతే పూర్తిగా నమ్మానో అదే నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అయింది.నేను నమ్మిన వ్యక్తే పబ్లిక్‌గా మరో వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండటం చూసి తట్టుకోలేకపోయాను. దీంతో నా జీవితంలో కి మరో వ్యక్తికి చోటు ఇవ్వలేదు అని ఆమె తెలిపింది.

Show comments