School Bus Fire Accident: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని కృష్ణారెడ్డి పేటలో ఈ రోజు ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో విద్యార్థులను ఎక్కించుకుంటుండగానే మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సులో మంటలు రావడం గమనించిన డ్రైవర్, క్లీనర్ తక్షణమే స్పందించి విద్యార్థులను త్వరగా సురక్షితంగా బస్సు నుండి కిందకు దింపేశారు. దీనితో బస్సులోని పిల్లలకు ఎంటువంటి గాయాలు కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదు.
Read Also:Illegal Affair Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు.. తల్లి అరెస్ట్..!
అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం అందరూ ఉపరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా కాలిపోయింది. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో విద్యార్థులు ఉన్న సమయంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగించింది.
Read Also:ENG W vs IND W: ఇన్నాళ్లకు.. ఎట్టకేలకు.. ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ కైవసం చేసుకున్న భారత్..!
ఈ ఘటనపై సంబంధిత అధికారులు ప్రమాదంకు కారణమైన వివరాలను కనుగొనేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో బస్సులలో సురక్షిత చర్యలు, నిర్వహణ పద్ధతులపై పాఠశాలల యాజమాన్యాలు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం కనపడుతోంది.
