NTV Telugu Site icon

Ambulance Blast: అంబులెన్స్‌కు మంటలు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి

Ambulance

Ambulance

Ambulance Blast: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఓ గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు తృటిలో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గర్భిణిని, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా దాదా వాడి ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. ఉన్నటుండి అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Also Read: Atrocious Case: ఐదేళ్ల కూతురిపై మృగంలా దాడి చేసిన తాగుబోతు తండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు

అంబులెన్స్‌లో మంటలు చెలరేగినట్లు గుర్తించిన వెంటనే డ్రైవర్ అంబులెన్స్‌పై నుంచి కిందకు దూకాడు. గర్భిణిని, కుటుంబసభ్యులను కూడా వెంటనే బయటకు తీశారు. కొద్ది నిమిషాల తర్వాత అంబులెన్స్‌ లోని ఆక్సిజన్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. అంబులెన్స్‌లో మంటలు పెద్దెత్తున వ్యాపించాయి. దీంతో కొన్ని అడుగుల ఎత్తులో నిప్పురవ్వలు వెలువడ్డాయి. కొద్దిసేపటికే అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. అలాగే ఈ ఘటనతో హైవేపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Also Read: GAIL Recruitment 2024: గెయిల్ ఇండియాలో 261 పోస్టులు ఖాళీలు.. లక్షల్లో జీతం

Show comments