Site icon NTV Telugu

Telangana Police : నేరగాళ్లకు నో ఎస్కేప్.. అంబిస్ టెక్నాలజీతో క్రిమినల్స్‌ను ట్రాక్

New

New

కొత్తగా ఏదైనా నేరం జరిగితే… ముందుగా పాత నేరస్తుల డేటాను పోలీసులు పరిశీలిస్తారు. దాదాపు చాలా కేసుల్లో ఇదే ఆనవాయితీ ఉంటుంది. అంటే పాత నేరస్తుల క్రైమ్ తీరు.. వారి మోటో ఆధారంగా కేసులు ఛేదిస్తారు. అలాగే కొన్ని కేసుల్లో ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కూడా క్రిమినల్స్‌ను పట్టుకుంటారు. ఇప్పుడు అందుకోసం కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఆ టెక్నాలజీ ఏంటి? ఎలా పని చేస్తుందో చూద్దాం.నేరాలు చేసేవారు ఇక తప్పించుకోలేరు. వరుసగా నేరాలు చేసేవారు ఇక తప్పించుకోలేరు… కొత్త టెక్నాలజీతో దుమ్ము దులిపేయనున్న పోలీసులు. ఎందుకంటే పోలీసులు కొత్త టెక్నాలజీతో దుమ్ము దులిపేయనున్నారు.. పోలీస్ శాఖ తెస్తున్న అంబిస్ టెక్నాలజీతో క్రిమినల్స్​ఎక్కడున్నా వారి గత చరిత్ర ఆధారంగా పోలీసులకు ఇట్టే దొరికిపోతారు. ఇప్పటివరకు వేలిముద్రలకే పరిమితమైన పోలీసులు ఇక నుంచి నేరగాళ్ల కాలిముద్రలు కూడా సేకరించనున్నారు. ఇందుకోసం పోలీస్​శాఖ ఆధ్వర్యంలో అంబిస్ పరికరాలను రూపొందించారు. ఈ పరికరంతో నేరస్తుల కాలిముద్రలు, ఐరిస్, ముఖ కవలికలు, ఎత్తు, బరువు, చేతి రాత ఇలా ప్రతీ అంశాన్ని నిక్షిప్తం చేసే అవకాశం ఉంది. ఏదైనా నేరం జరిగినప్పుడు అది చేసినవారిని గుర్తించేందుకు పోలీసులు తమ వద్ద ఉన్న పాత నేరస్తుల వివరాలతో తెలుసుకోవచ్చు..

Hash Oil : హైదరాబాద్‌లో తొలిసారిగా కోటిన్నర విలువైన హాష్ ఆయిల్ సీజ్‌

నేరగాళ్ల వేలిముద్రలు, అరచేతి ముద్రలు తీసుకునేవారు.ఇప్పటివరకు నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు అఫీజ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. దీనితో లైవ్ స్కానర్ ద్వారా నేరగాళ్ల వేలిముద్రలు, అరచేతి ముద్రలు మాత్రమే తీసుకునేవారు. అయితే నేరస్తులు తెలివితేటలతో తమ వేలిముద్రలు, అరచేతి ముద్రలను లైవ్ స్కానింగ్ లో క్లారిటీగా రాకుండా చూసుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. చాలాసార్లు దీని ద్వారా నేరస్తులను గుర్తించడంలో ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఇక నుంచి దీనికి భిన్నంగా ఉండే అంబిస్ టెక్నాలజీని వినియోగించబోతున్నారు పోలీసులు.

అంబిస్ టెక్నాలజీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ఆప్టిప్లెక్స్ ఆల్ ఇన్ వన్, ఐరిస్ స్కానర్, ఎప్సన్ వి 39 స్కానర్, లాజిక్ వెబ్ కామ్, హెల్త్ సెన్స్ బీఎస్ 161, ఎంఎస్ సీడీ పాపిలోన్ పామ్ లైవ్ స్కానర్ ఉంటాయి. వీటన్నింటి ద్వారా సేకరించే వివరాలను అంబిస్ డాటా బేస్‌లో నిక్షిప్తం చేస్తారు. ఏదైనా నేరం జరిగినప్పుడు అక్కడి సాక్ష్యాలతో సరిపోలుస్తారు. నేరస్తులను పట్టుకోవడం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు… ఈ కొత్త టెక్నాలజీని నిర్మల్ జిల్లాలోని 12 ఠాణాల్లో అమలు చేయనున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. దీనికోసం సంబంధిత పరికరాలను పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేస్తున్నామన్నారు. కొత్త టెక్నాలజీతో నేరస్తులను గుర్తించడం సులభంగా మారుతుంది. పోలీస్​అధికారులకు సాంకేతిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయన్నారు.. నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడం అంబిస్ కీలకపాత్ర.మొత్తంగా నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడం వంటి అంశాలలో అంబిస్​టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందనేది వాస్తవం…

Revanth Reddy: హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి

Exit mobile version