Telangana Police : నేరగాళ్లకు నో ఎస్కేప్.. అంబిస్ టెక్నాలజీతో క్రిమినల్స్‌ను ట్రాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్తగా ఏదైనా నేరం జరిగితే… ముందుగా పాత నేరస్తుల డేటాను పోలీసులు పరిశీలిస్తారు. దాదాపు చాలా కేసుల్లో ఇదే ఆనవాయితీ ఉంటుంది. అంటే పాత నేరస్తుల క్రైమ్ తీరు.. వారి మోటో ఆధారంగా కేసులు ఛేదిస్తారు. అలాగే కొన్ని కేసుల్లో ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కూడా క్రిమినల్స్‌ను పట్టుకుంటారు. ఇప్పుడు అందుకోసం కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఆ టెక్నాలజీ ఏంటి? ఎలా పని చేస్తుందో చూద్దాం.నేరాలు చేసేవారు ఇక తప్పించుకోలేరు. వరుసగా నేరాలు చేసేవారు ఇక తప్పించుకోలేరు… కొత్త టెక్నాలజీతో దుమ్ము దులిపేయనున్న పోలీసులు. ఎందుకంటే పోలీసులు కొత్త టెక్నాలజీతో దుమ్ము దులిపేయనున్నారు.. పోలీస్ శాఖ తెస్తున్న అంబిస్ టెక్నాలజీతో క్రిమినల్స్ఎక్కడున్నా వారి గత చరిత్ర ఆధారంగా పోలీసులకు ఇట్టే దొరికిపోతారు. ఇప్పటివరకు వేలిముద్రలకే పరిమితమైన పోలీసులు ఇక నుంచి నేరగాళ్ల కాలిముద్రలు కూడా సేకరించనున్నారు. ఇందుకోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అంబిస్ పరికరాలను రూపొందించారు. ఈ పరికరంతో నేరస్తుల కాలిముద్రలు, ఐరిస్, ముఖ కవలికలు, ఎత్తు, బరువు, చేతి రాత ఇలా ప్రతీ అంశాన్ని నిక్షిప్తం చేసే అవకాశం ఉంది. ఏదైనా నేరం జరిగినప్పుడు అది చేసినవారిని గుర్తించేందుకు పోలీసులు తమ వద్ద ఉన్న పాత నేరస్తుల వివరాలతో తెలుసుకోవచ్చు..
Hash Oil : హైదరాబాద్‌లో తొలిసారిగా కోటిన్నర విలువైన హాష్ ఆయిల్ సీజ్
Also Read
నేరగాళ్ల వేలిముద్రలు, అరచేతి ముద్రలు తీసుకునేవారు.ఇప్పటివరకు నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు అఫీజ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. దీనితో లైవ్ స్కానర్ ద్వారా నేరగాళ్ల వేలిముద్రలు, అరచేతి ముద్రలు మాత్రమే తీసుకునేవారు. అయితే నేరస్తులు తెలివితేటలతో తమ వేలిముద్రలు, అరచేతి ముద్రలను లైవ్ స్కానింగ్ లో క్లారిటీగా రాకుండా చూసుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. చాలాసార్లు దీని ద్వారా నేరస్తులను గుర్తించడంలో ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఇక నుంచి దీనికి భిన్నంగా ఉండే అంబిస్ టెక్నాలజీని వినియోగించబోతున్నారు పోలీసులు.
అంబిస్ టెక్నాలజీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ఆప్టిప్లెక్స్ ఆల్ ఇన్ వన్, ఐరిస్ స్కానర్, ఎప్సన్ వి 39 స్కానర్, లాజిక్ వెబ్ కామ్, హెల్త్ సెన్స్ బీఎస్ 161, ఎంఎస్ సీడీ పాపిలోన్ పామ్ లైవ్ స్కానర్ ఉంటాయి. వీటన్నింటి ద్వారా సేకరించే వివరాలను అంబిస్ డాటా బేస్‌లో నిక్షిప్తం చేస్తారు. ఏదైనా నేరం జరిగినప్పుడు అక్కడి సాక్ష్యాలతో సరిపోలుస్తారు. నేరస్తులను పట్టుకోవడం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు… ఈ కొత్త టెక్నాలజీని నిర్మల్ జిల్లాలోని 12 ఠాణాల్లో అమలు చేయనున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. దీనికోసం సంబంధిత పరికరాలను పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేస్తున్నామన్నారు. కొత్త టెక్నాలజీతో నేరస్తులను గుర్తించడం సులభంగా మారుతుంది. పోలీస్అధికారులకు సాంకేతిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయన్నారు.. నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడం అంబిస్ కీలకపాత్ర.మొత్తంగా నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడం వంటి అంశాలలో అంబిస్టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందనేది వాస్తవం…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!