Site icon NTV Telugu

CI Sudhakar : సీఐ సుధాకర్‌కు బెయిల్‌ మంజూరు..

Ci Sudhakar

Ci Sudhakar

భూ వివాదం, ఫోర్జరీ కేసులో అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ పేరం సుధాకర్‌ను వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి అరెస్ట్ తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ శ్రీ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. వనస్థలిపురం పోలీసులు ఈ వారం ప్రారంభంలో ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారుజ ఒక ప్రవాస భారతీయుడు తాను భూ మోసానికి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. అతని పిటిషన్ ప్రకారం.. అతను రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామంలో భూమి కొనుగోలు కోసం శ్రీ సుధాకర్‌కు రూ.54 లక్షలు చెల్లించాడు. మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి సీఐ సుధాకర్ డబ్బులు కొట్టేశారు. పోలీసులు విచారణ జరిపి సుధాకర్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈమేరకు సీఐ సుధాకర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయవూర్తి ఇద్దరు షురిటీలతో 15వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేశారు.

Also Read : Kanti Velugu : కంటి వెలుగు నిర్వహణపై సీఎస్‌ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్

వివరాలు ఇలా..
గతంలో సస్పెండైన ఆర్ఐ రాజేష్‌పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే కేసు నమోదు చేశారు. కందుకూరు లిమిట్స్‌లోని నేదునూరు గ్రామంలో సర్వేనెంబర్ 54/2 లో ఉన్న పది ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి బి.ఎన్.రెడ్డి ఎస్ కే డి నగర్ కు చెందిన విజయ కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి 54.5 లక్షల రూపాయలు తీసుకొని నెలలు గడుస్తున్నా ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితులు వనస్థలిపురం పి ఎస్ లో ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలతో సస్పెండైన అర్ ఐ తాను ఎమ్మార్వోనంటూ నకిలీ ఐడి కార్డ్ సృష్టించి త్వరలో ప్రమోషన్ ద్వారా ఆర్డీఓ అవుతానని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నాడు. రాజేశ్ తమ నుంచి తీసుకున్న 54.5 లక్షల రూపాయలను సిఐ సుధాకర్‌కు ఇచ్చినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకు ఇప్పిస్తానన్న ల్యాండ్.. ఆర్ ఐ రాజేష్ సోదరుడు గతంలోనే కొనుగోలు చేశాడని చెప్పి దానిపై ధరణి పోర్టల్ లోగో తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ ల్యాండ్ అమ్ముతారంటూ తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదులో తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు.

Exit mobile version