Site icon NTV Telugu

Ambati Rayudu: ఎంఎల్‌సీ నుంచి తప్పుకున్న అంబటి రాయుడు.. కారణమదేనా..?

Rayudu

Rayudu

చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు ఇటీవలే భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు ఈ నెల నుంచి అమెరికా వేదికగా జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) నుంచి తప్పుకుంటున్నాడు. ఈ విషయాన్ని టెక్సాస్ సూపర్ కింగ్స్ ట్విటర్లో తెలిపింది. రాయుడు లీగ్ నుంచి తప్పుకుంటున్న విషయమై.. టీఎస్కే ట్వీట్ లో వివరణ ఇచ్చింది. ‘ఎంఎల్‌సీ ఫస్ట్ సీజన్ లో అంబటి రాయుడు అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ సీజన్ కు దూరంగా ఉంటున్నాడు. కానీ ఇండియా నుంచి అతడు మా టీమ్ కు మద్దతుగా ఉంటాడు’ అని తెలిపింది.

Andhra Pradesh: ఫొటోలు మార్ఫింగ్ చేసి పెళ్లి సంబంధాలు చెడగొట్టాడు.. ఇలా చిక్కాడు..!

ఎంఎల్‌సీ ఫస్ట్ సీజన్ నుంచి రాయుడు తప్పుకోవడం వెనుక ఏపీ రాజకీయాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండుసార్లు కలిశాడు. ఇటీవల తన సొంత జిల్లా గుంటూరులో విస్తృత పర్యటనలు చేస్తూ వివిధ వర్గాలను కలుస్తుండటం రాజకీయాల్లోకి వెళ్లడం కోసమనే గుసగుసలు వినపడుతున్నాయి. సో చూడాలి మరీ.. ఈ విషయమై జట్టు నుంచి తప్పుకున్నాడా.. లేదంటే వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయా అని తెలియాల్సి ఉంది.

Minister Srinivas Goud: ఎన్నికల కోసమే మోడీ బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు

మరోవైపు అమెరికా వేదికగా జరుగబోయే ఈ మెగా టోర్నీలో నాలుగు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లే దక్కించుకున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నైలతో పాటు మరో రెండు స్థానిక ఫ్రాంచైజీలు ఆడనున్నాయి. చెన్నై టీమ్ కు టెక్సాస్ సూపర్ కింగ్స్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ టీమ్ కు సౌతాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. అతనితో పాటు మరో సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ మిల్లర్ కూడా టెక్సాస్ కే ఆడుతున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన వారే విదేశీ లీగుల్లో ఆడేందుకు ఆస్కారముంది.

Exit mobile version