NTV Telugu Site icon

Ambati Rayudu : నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు

Ambati Rayudu

Ambati Rayudu

గుంటూరు ఏటి అగ్రహారం లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటిస్తున్నారు. ఆటో డ్రైవర్ యూనియన్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా Ntv తో అంబటి రాయుడు మాట్లాడుతూ.. విద్య వ్యవస్థ, వ్యవసాయ, కార్మిక సమస్యల పై ప్రజలని కలుస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంపై కార్మికులు, రైతుల్లో మంచి స్పందన వస్తుందని ఆయన వెల్లడించారు. నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఆయన వెల్లడించారు. మంచిపనులు జరగాలంటే కొంత ఓపిక కావాలని ఆయన అన్నారు.

Also Read : Gandeevadhari Arjuna Pre-Teaser: పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన మెగా ప్రిన్స్

వైసీపీ నాలుగేళ్ల ప్రభుత్వంలో రెండేళ్లు కరోనా కష్ట కాలం ఉందని, కరోనా తో ప్రపంచం అంత స్తంభించి పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల కోసం పంట కొనుగోలు కేంద్రాలు, నాణ్యమైన విత్తనాల సరఫరాలో కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయని అంబటి రాయుడు తెలిపారు. నా పరిధిలో వాటికి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేస్తానని ఆయన అన్నారు. వాలంటీర్ వ్యవస్థ పై ప్రజలు సంతృప్తి గా ఉన్నారని ఆయన వెల్లడించారు.

Also Read : Minor Lovers Suicide: సిద్దిపేటలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని మైనర్ ప్రేమ జంట ఆత్మహత్మ

అయితే.. 70ఏళ్ల నుంచి దేశంలో జరగనిది ఏపీలో వాలంటీర్ల ద్వారా జరుగుతోందని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన అని, ఇది ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడుతుందన్నారు.కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు మరువలేనివన్నారు. కరోనా సమయంలో ప్రజలకు వాలంటీర్లు చేసిన సేవను ప్రశంసించారు.మంచి పనులు చేస్తున్న వారిపై బరదజల్లే వారు అన్నిచోట్లా ఉంటారని రాయుడు పేర్కొన్నారు. వారిని పట్టించుకుండా ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు