Site icon NTV Telugu

Ambati Rambabu: జైలు నుంచి పోసాని విడుదలలో జాప్యం..! అంబటి సంచలన ఆరోపణలు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: శుక్రవారం రోజు బెయిల్‌ వచ్చినా.. పోసాని కృష్ణ మురళి విడుదలలో జాప్యం అయ్యింది.. ఓ దశలో నిన్నే రిలీజ్‌ అవుతారనే ప్రచారం జరిగింది.. అది సాధ్యం కాకపోవడంతో.. ఈ రోజు ఉదయమే విడుదలకు పోసాని లాయర్లు ఏర్పాట్లు చేశారని చెప్పారు.. కానీ, ఎట్టకేలకు 24 రోజుల ఉత్కంఠకు తెర దించుతూ.. గుంటూరు జిల్లా జైలు నుంచి ఈ రోజు సాయంత్రం 4.50 గంటలకు విడుదలయ్యారు పోసాని కృష్ణమురళి.. జైలు బయట పోసానిని కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు.. మంత్రి నారా లోకేష్ చెప్పటం వల్లే మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు బయటకు వదలకుండా ఆపారు.. లోకేష్ కనుసన్నలలో అంతా నడుస్తుందని ఆరోపించారు.. 24 రోజుల నిర్బంధం తర్వాత పోసాని జైలు నుంచి రిలీజ్ అయ్యారు.. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోసాని మాట్లాడలేదన్న ఆయన.. పోసాని హత్యలు, దొంగతనాలు, దోపిడీలు చేయలేదు.. మీడియా ముందు మాట్లాడారని కేసులు పెట్టారు.. రెండు ప్రెస్ మీట్లు పెడితే 18 కేసులు పెట్టి 24 రోజులు నిర్బంధించారు.. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ తిప్పారు.. మీడియాలో దూషించారని కేసులు కట్టారు.. టీడీపీ వాళ్లు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడినా కేసులు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Husband Suicide: ‘‘నా చావుకు భార్య, అత్త కారణం’’.. వేధింపులకు మరో భర్త బలి..

రెడ్ బుక్ రైటర్ లోకేష్ పోలీసు బాస్‌లతో టచ్ లో ఉంటారు అని ఆరోపించారు అంబటి.. పెద్ద పెద్ద నేరాల్లో కస్టడీ అడుగుతారు.. ఈపురు వైస్ ప్రెసిడెంట్ ని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.. కోర్టులో వాళ్ల కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఆ తర్వాత చిన్న నోటీస్ ఇచ్చి పంపారు.. ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శ చేశాడని అరెస్ట్ చేస్తారు.. ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. చంద్రబాబు ఆరోగ్యంపై మాట్లాడారు.. దానిమీద కేసు పెట్టరా..? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందుతున్నారు.. ప్రశ్నిస్తే వాళ్ళను అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.. తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుంచుకోండి.. ఆరోపణలు రుజువు చేయకపోతే పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తాం.. మా లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది గుర్తుంచుకోవాలి.. పోసాని గత నెల 26 నుంచి ఇప్పటి వరకు అనేక కేసులు పెట్టినా మా లీగల్ టీం ఫాలో చేసింది.. ఇవాళ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశాం.. మళ్ళీ ఏ పీటీ వారెంట్ అని పోలిసులు వస్తారేమో అని చూస్తూ ఉన్నాం.. పోలీసులు చట్ట పరిధిలో పనిచేయాలి.. పరిధి దాటితే చట్టపరంగా వెళ్తామని హెచ్చరించారు.

Read Also: Bayya Sunny Yadav : హైకోర్టును ఆశ్రయించిన సన్నీ యాదవ్

రెడ్ బుక్ ఆయనకు అధికారం మీద పిచ్చి అని మంత్రి లోకేష్‌పై సెటైర్లు వేసిన అంబటి.. 111 సెక్షన్ అంటే సీరియస్ సెక్షన్… డెడ్ బాడీలు దొరకటం లేదు.. లేకుంటే పోలీసులు మర్డర్ కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.. పోలీసులు ఏ కేసు పెట్టినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలకు సూచించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..

Exit mobile version