టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొత్త కాదని విమర్శించారు. సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుండి కలిసి పోటీ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు.. ఇప్పటివరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారని మంత్రి ఆరోపించారు. మేం సిద్ధం అని జగన్ అంటుంటే.. టీడీపీ, జనసేన దగ్గర నుంచి సమాధానం లేదని ఎద్దేవా చేశారు.
Read Also: IND vs ENG: ముగిసిన భారత్ రెండో ఇన్సింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ 399
రానున్న ఎన్నికల్లో 175 సీట్లతో వైసీపీ అఖండ విజయం ఖాయం అని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. తమ టార్గెట్ గెలవటం కాదు.. 175 సీట్లు గెలవటం అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు ఓడిపోవడమే తమ టార్గెట్ అని దుయ్యబట్టారు. సీఎం జగన్ ను ఓడించడం మీ వల్ల కాదని.. పేద ప్రజానీకం తమకు అండగా ఉందని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేసినా.. వైసీపీ విజయం ఖామమని అన్నారు. ఎన్నికల ముందు టికెట్లు రాని జంపింగ్ నాయకులు పార్టీలు మారటం సాధారణమేనని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Anand Mahindra: IIT JEE ,UPSC పరీక్షల్లో ఏది కష్టం.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..?