Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ambati Rambabu Questions Amaravati Completion By 2029 Slams Chandrababu

Ambati Rambabu: అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కి ఏడు బిల్డింగ్‌లైనా పూర్తి చేస్తారా..?

Published Date :April 3, 2026 , 6:18 pm
By Sudhakar Ravula
Ambati Rambabu: అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కి ఏడు బిల్డింగ్‌లైనా పూర్తి చేస్తారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ambati Rambabu: నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఏపీలో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అమరావతి ప్రాజెక్ట్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, 2029 నాటికీ రాజధాని పూర్తవుతుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంచుతున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం సాధ్యం కాదని ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 2029 నాటికీ కనీసం ఏడు భవనాలైనా పూర్తి చేస్తారో లేదో అనుమానం ఉందని అన్నారు.

Read Also: Iron Rich Foods: బాబోయ్ బ్లడ్ తగ్గిందా?.. ఇవి తింటే సరిపడా రక్తం పడుతుంది!

మావిగన్ అనే కొత్త అభివృద్ధి ఆలోచనను కూడా అంబటి ప్రస్తావించారు. ఇది జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ప్రతిపాదనగా పేర్కొంటూ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్‌గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదంతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం సుమారు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ మావిగన్ ప్రాజెక్ట్‌ను కేవలం 20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని అంబటి పేర్కొన్నారు. మూడు జిల్లాలతో కూడిన ఈ కారిడార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వృద్ధి కేంద్రంగా మారుతుందని చెప్పారు.

అలాగే అమరావతి రైతుల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు అంబటి. తమకు హామీ ఇచ్చిన ప్లాట్లు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీఆర్డీఏ అధికారులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత లేకపోవడం వల్లే ఈ అయోమయం నెలకొంది అని అంబటి ఆరోపించారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారడం సహజమేనని, అవసరమైతే కొత్త తీర్మానాలు ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు. మొత్తంగా, అమరావతి ప్రాజెక్ట్ భవిష్యత్తుపై మరోసారి రాజకీయ వాదనలు వేడెక్కుతున్నాయి. 2029 నాటికి రాజధాని పూర్తి అవుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati capital news
  • Amaravati construction update
  • ambati rambabu comments
  • Andhra Pradesh Capital Issue
  • ap political news

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions