Ambati Rambabu: సత్తెనపల్లిలో నన్ను ఓడించటానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నైనా రమ్మనండి తెల్చుకుంటాను అంటూ సవాల్ చేశారు.. అయితే, కన్నా అనే వస్తాదును పంపి నన్ను ఓడించ డానికి చూస్తున్నారన్న ఆయన.. పెదకూరపాడు, గుంటూరు కుస్తీ పోటీలో కన్నా గెలిచాడంట.. ఇప్పుడు సత్తెనపల్లి వచ్చి నన్ను నలిపేస్తాడాని, నన్ను ఓడిస్తాడని కన్నాను రంగంలోకి తెచ్చారు అంటూ సీనియర్ పొలిటీషియన్, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై సెటైర్లు వేశారు.. కన్నా ఉడత ఊపులకు భయపడే రకం కాదు నేన్న అంబటి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడ్ని.. నేను రంగంలో ఉండి ఉంటే వైఎస్ కేబినెట్‌లో కన్నా మంత్రిగా ఉండేవాడే కాదన్నారు.. సత్తెనపల్లిలో మా టీమ్ దెబ్బ ఎలా ఉంటుందో కన్నా లక్ష్మీనారాయణకు రుచి చూపిస్తారంటూ హెచ్చరించారు మంత్రి అంబటి రాంబాబు.
Read Also: Geetha Reddy : 30 నియోజకవర్గాల్లో భట్టి పాదయాత్ర చిన్న విషయం కాదు
కాగా, సత్తెనపల్లిలో 2024 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ.. టీడీపీ తరఫున పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.. ఇక, తాను కూడా సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని కోడల శివరామ్ కూడా ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి.. టీడీపీ టికెట్ ఇవ్వకున్నా పోటీ చేస్తాననే అర్థం వచ్చేలా మాట్లాడారు.. ఇప్పుడు చంద్రబాబు వచ్చినా.. కన్నా వచ్చినా తాను రెడీ అని ప్రకటించారు మంత్రి అంబటి రాంబాబు. దీంతో.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సత్తెనపల్లి హాట్ టాపిక్‌గా మారిపోతోంది.