Site icon NTV Telugu

Ambati Rambabu: ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్‌ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని ఆయన కొనియాడారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు.

Read Also: Heart Attack: ఏపీ అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న మార్షల్ గుండెపోటుతో మృతి

ముద్రగడ పేరు మార్చుకున్నారని తెలిసి అభినందించడానికి వచ్చానని అంబటి రాంబాబు చెప్పారు. సవాల్‌కు కట్టుబడి ముద్రగడ పేరు మార్చుకున్నారని.. చాలామంది సవాళ్లు చేస్తారు.. నాకు తెలిసి ఎవరూ కట్టుబడి ఉండలేదన్నారు. పేరు మారినా ముద్రగడ ముద్రగడే అంటూ అంబటి ప్రశంసించారు.వంగవీటి రంగా జైలులో ఉన్నప్పుడు కాపునాడు సభకు హాజరు కావడానికి తన పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అంటూ పేర్కొన్నారు. కాపు ఉద్యమానికి కారణం ముద్రగడ, దానివలన పొలిటికల్‌గా చాలా నష్టపోయాడన్నారు.

 

Exit mobile version