Site icon NTV Telugu

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద టెన్షన్‌ టెన్షన్‌..

Ambati

Ambati

Ambati Rambabu: గుంటూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన అనుచరులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయవచ్చన్న వార్తలు వ్యాపించడంతో అప్రమత్తమైన అంబటి అనుచరులు ఇంటివద్దకు చేరుకుని మద్దతుగా నిలిచారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతను పెంచింది.

READ MORE: Magha Purnima 2026: రేపు ఈ వస్తువులను దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం.!

Exit mobile version