Ambati Rambabu: గుంటూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన అనుచరులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన…