Site icon NTV Telugu

Ambati Rambabu : పవన్‌ లాంటి అనైతికమైన రాజకీయవేత్త దేశంలోనే లేరు

Ambati

Ambati

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు. పొత్తులో ఉండి నేతలతో చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారని, పవన్‌ లాంటి అనైతికమైన రాజకీయవేత్త దేశంలోనే లేరని ఆయన విమర్శలు గుప్పించారు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్నటి దాక ఓట్లు కొనకూడదని చేగువేరాలాగ కాకమ్మ కథలు చెప్పాడని, ధర్మంగా రాజకీయాలు చేస్తానన్నాడని, ఇప్పుడు ఓట్లు కొనుక్కోమని క్యాడర్‌కు లైసెన్స్‌ ఇచ్చాడని మంత్రి అంబటి ఆరోపించారు. పవన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, పవన్‌, చంద్రబాబును జనసైనికులు నమ్మవద్దని మంత్రి అంబటి హితవు పలికారు.

 
Trisha: 25 లక్షలకు రిసార్టు ఆరోపణలు.. అన్నాడీఎంకే నేతకు త్రిష లీగల్ నోటీస్

‘సిద్ధం’ సభలకు వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతల భ్రమలు తొలిగిపోతున్నాయి. మళ్లీ సీఎంగా జగనే అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుస్తాం. అభివృద్ధిపై చర్చకు రమ్మని సిగ్గులేకుండా చంద్రబాబు సవాల్‌ విసురుతున్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు. సీఎం జగన్‌ను సవాల్‌ చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబుతో చర్చకు నేనే సిద్ధం. టీడీపీ కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధం. చర్చ అయ్యాక చంద్రబాబు బావురుమని ఏడవకూడదు’’ అంటూ మంత్రి చురకలు అంటించారు.

Byjus : చెల్లించిన ఫీజు రీఫండ్ చేయకపోవడంతో బైజూస్ ఆఫీసులో టీవీ తీసుకెళ్లిన స్టూడెంట్స్

Exit mobile version