NTV Telugu Site icon

Ambati Rambabu : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హజరయ్యే హక్కు చంద్రబాబుకు లేదు

Ambati Rambabu

Ambati Rambabu

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హజరయ్యే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఎన్టీఆర్ మరణనానికి కారణం కూడా చంద్రబాబే అని, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దే దించాడన్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ప్రసగంలో చంద్రబాబు ఔరంగజేబుతో పోల్చారని అంబటి రాంబాబు విమర్శించారు. నేను తురక గంగమ్మ కుటుంబానికి అన్యాయం చేసానని ఆరోపణలు చేశాడని, తురక అనిల్‌తో పాటు మరో ఇద్దరు చనిపోయారని,నా మీద కక్ష్య తప్ప, బాధితుల మీద ప్రేమలేదని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బాధితుల మీద ప్రేమ ఉంటే ప్రమాదంలో చనిపోయిన మిగిలిన కుటుంబాలకు కూడా న్యాయం చేయాలన్నారు.

Also Read : Shocking incident: సెలవు తీసుకున్న డ్రైవర్‌.. పోస్టర్లు వేసిన యజమాని

ఇదిలా ఉంటే.. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్నారు. ఆయనకు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్ధన్‌, సావనీర్‌ కమిటీ రజనీకాంత్‌కు ఘన స్వాగతం పలికారు. నేడు సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఈ వేదికపై ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలను ఈ పుస్తకాల్లో పొందుపరిచారు.

Also Read : Brij Bhushan: బ్రిజ్‌ భూషణ్‌ సెల్ఫీ వీడియో.. ఆ రోజే వస్తా ప్రాణాలు వదిలేస్తా..

Show comments