Ambati Rambabu: జనసేనాని పవన్‌పై మరోసారి ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క.. పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్.. అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. భీమవరం వేదికగా ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అంబటి.. ఢిల్లీలో పెద్దలలో నీకు సన్నిహిత సంబంధం ఉంటే రాష్ట్రానికి మేలు చేయ్.. సీఎం జగన్ ను బెదిరిస్తున్నావా..? మతి భ్రమించి మాట్లాడుతున్న పవన్ లో పిచ్చి కుక్క లాంటి వాడు అంటూ మండిపడ్డారు. జగన్ రాజకీయాన్ని చూసి నేర్చుకో.. తప్పుడు కేసులు పెట్టినా జగన్ భయపడ కుండా పోరాటం చేశాడని గుర్తుచేశారు. నలుగురు విప్లవ కారులు పేర్లు తెలిస్తే నువ్వు విప్లవ కారుడివా..? వివాహ వ్యవస్థలో విప్లవం తెచ్చావా? అంటూ సెటైర్లు వేశారు.
Read Also: Ravindra Jadeja Rapid Fire: టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?.. రవీంద్ర జడేజా సమాధానం ఇదే!
వివాహ వ్యవస్థ పై నీకు నమ్మకం లేదు.. పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. అలాంటి వ్యక్తి ప్రజలకు నీతులు చెప్తున్నాడు.. పేదలకు, పెత్తందార్ల మధ్య పోరాటంలో జగన్ పేదల పక్కన నిలబడితే పవన్, చంద్రబాబు పక్కన చేరాడని విమర్శించారు. పవన్ మాటలు సంస్కార హీనంగా ఉన్నాయి.. పవన్ మాటలతో అసాంఘిక శక్తులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. యువత అప్రమత్తంగా ఉండండి.. పవన్ సిద్ధాంతాలు తెలియని వ్యక్తి.. తప్పులన్నీ ఆయన దగ్గర పెట్టుకుని ఎదుటి వారిని దూషించే మనస్తత్వం పవన్ ది అని ఫైర్ అయ్యారు.
Read Also: Minister KTR: మరో రెండేళ్లలో ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు: కేటీఆర్
చిత్తశుద్ధిగా పరిపాలిస్తున్న జగన్ పై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు అని పవన్‌పై మండిపడ్డ అంబటి రాంబాబు.. సీఎం జగన్ గురించి నాకు అంతా తెలుసు అని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నాడు.. ఇక, హైదరాబాద్ నుండి వచ్చి మమ్మల్ని గెలకక పోతే పవన్ కు తోచదన్న ఆయన.. వారాహి పైకి ఎక్కి చిందులు వేస్తున్న ప్రాణాలు కు తెగించానని చెప్తున్నాడు.. చంద్రబాబు ,లోకేష్ ల పల్లకిలు మోస్తున్న పవన్ కు విప్లవం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మరోవైపు.. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ను చంద్రబాబుకు అమ్మేశాడన్న అనుమానం ఉంది.. వారాహి పేరు పెట్టుకుని ఆ వాహనం పై నుండి అసత్య ప్రచారాలు, అసభ్య పదజాలం వాడుతున్నాడు.. అందుకే పవన్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.