Site icon NTV Telugu

Ambati Rambabu: మాజీ మంత్రి ఇంటి వద్ద క్షణక్షణం ఉద్రిక్తత.. అంబటికి ఫోన్ చేసిన వైఎస్ జగన్

Rambabu Jagan

Rambabu Jagan

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిదగ్గర హైటెన్షన్‌ కొనసాగుతోంది. క్షణక్షణం ఉద్రిక్తతగా మారుతోంది. టీడీపీ శ్రేణులు అక్కడే మోహరించారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు విడతలవారీగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అంబటి అంతు తేలుస్తామంటూ టీడీపీ కేడర్‌ మండిపడుతోంది. ఓపక్క పోలీసులు.. ఇంకోపక్క టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి ఇంట్లోనే ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మాజీ మంత్రికి ఫోన్ చేశారు.

READ MORE: Ravidas Jayanti 2026: రేపే గురు రవిదాస్ జయంతి.. డేరా సచ్‌ఖండ్ బాలన్‌ను సందర్శించనున్న ప్రధాని మోడీ

అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అంబటికి ఫోన్‌ చేసి పరామర్శించిన జగన్‌, ఆయనకు ధైర్యం చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీ మొత్తం అంబటి రాంబాబు వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడు..తూ రాష్ట్రం పూర్తిగా జంగిల్‌రాజ్‌గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంలా నడుపుతున్నారని విమర్శించారు. రోజురోజుకూ చంద్రబాబు దుర్మార్గాలు పెరిగిపోతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నాలు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

READ MORE: VIGNAN MAHOTSAV 2026: ప్రతిభకు గుర్తింపు ఇచ్చే జాతీయ యువజనోత్సవం.. యువతకు లక్కీ ఛాన్స్‌

అంబటి రాంబాబుపై జరిగిన దాడి కూడా యాదృచ్ఛికం కాదని, ముందే పన్నిన కుట్రలో భాగంగానే ఈ హత్యాయత్నం జరిగిందని జగన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈ ఘటనలో ప్రేక్షకుల్లా వ్యవహరించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఈ దుర్మార్గ పాలనను ఎక్కువ కాలం సహించబోరని జగన్‌ స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో దాడులు, హింసా ఘటనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.

Exit mobile version