Purchase Foxsky 65 inches 4K Ultra HD Smart LED TV Only Rs 37999 in Amazon: ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగష్టు 4 నుంచి 8 వరకు అందుబాటులో ఉంచింది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అమెజాన్ అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌టీవీలపై. కొన్ని స్మార్ట్‌టీవీలపై ఏకంగా 73 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఇస్తుంది. దాంతో రూ. 83 వేల స్మార్ట్‌టీవీని మీరు కేవలం రూ. 22 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఏ స్మార్ట్‌టీవీపై భారీ డిస్కౌంట్ ఉందో ఓసారి చూద్దాం.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా ఫాక్స్‌స్కై 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీ (Foxsky 50 inches 4K Ultra HD Smart LED TV 50FS-VS Black)పై భారీ ఆఫర్ ఉంది. ఫాక్స్‌స్కై 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ. 82,990గా ఉంది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌టీవీపై 73 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అంటే మీరు రూ. 60,991 ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌టీవీని మీరు కేవలం రూ. 21,999కు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
ఫాక్స్‌స్కై 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అప్పుడు ఇంకా తక్కువ ధరకే ఈ టీవీ పొందొచ్చు. ఎస్‌బీఐ కార్డు ద్వారా రూ.1250 వరకు తగ్గింపు పొందొచ్చు. దాంతో ఈ టీవీ రూ. 20,749కే వస్తుంది. ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 3,080 వరకు ఎక్స్‌ఛేంజ్ వస్తుంది. అప్పుడు మీరు రూ. 17 వేల బడ్జెట్‌లోనే కొత్త టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ రేపటివరకే అందుబాటులో ఉంటుంది. కాబట్టి త్వరగా కొనేసుకుంటే బెటర్.
ఫాక్స్‌స్కై 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీ (Foxsky 65 inches 4K Ultra HD Smart LED TV 65FS-VS Black) పై కూడా భారీ తగ్గింపు ఉంది. ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ. 129,990గా ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో ఈ టీవీపై 71 శాతం తగ్గింపు ఉంది. రూ. 91,991 తగ్గింపుతో ఈ స్మార్ట్‌టీవీని మీరు కేవలం రూ. 37,999కి సొంతం చేసుకోవచ్చు. ఎలాంటి బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేకుండానే మీరు ఈ ధరకు ఫాక్స్‌స్కై 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీని ఇంటికితీసుకెళ్లిపోవచ్చు.
Also Read: Tilak Varma Half Century: రిషబ్ పంత్ రికార్డు బద్దలు కొట్టిన తిలక్ వర్మ.. తృటిలో రోహిత్ ఫీట్ మిస్!