NTV Telugu Site icon

Amazon Project Kuiper: తొలి ఇంటర్నెట్ ఉపగ్రహాల కోసం ప్రాజెక్ట్ ‘కైపర్’ను సిద్ధం చేసిన అమెజాన్

Amazon

Amazon

Amazon Project Kuipe: అమెజాన్ తన ప్రాజెక్ట్ ‘కైపర్’ కింద 27 కొత్త ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ఏప్రిల్ 10న యునైటెడ్ లాంచ్ అలయన్స్ (ULA) అట్లాస్ V రాకెట్ ద్వారా జరగనుంది. ప్రాజెక్ట్ కైపర్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలలో వీటిని అందుబాటులోకి తీసుకరావడమే.

ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి జరగనుంది. ఈ ప్రయోగాన్ని భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 10న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రయోగం చేసాయనున్నారు. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు అమెజాన్, ULA అధికారిక వెబ్‌సైట్‌లు లేదా యూట్యూబ్ ఛానెల్‌లను సందర్శించి, లైవ్ స్ట్రీమ్‌ను వీక్షించవచ్చు.

Read Also: Viral Video: అర్ధరాత్రి వంటింటి గోడపై ప్రత్యక్షమైన మృగరాజు!

ఈ ప్రయోగం ప్రత్యేకమైనది ఎందుకంటే.. ఇది ఈ సంవత్సరంలో ULA చేస్తున్న మొదటి ప్రధాన మిషన్ కాగా, దీనిలో అత్యంత బరువైన ప్రాజెక్ట్ కైపర్ పేలోడ్‌ను పంపవలసి ఉంది. ఇక, అమెజాన్ తన ఉపగ్రహాలను పెద్ద ఎత్తున మోహరించడం ఇదే మొదటిసారి. గతంలో 2023 అక్టోబరులో అమెజాన్ 2 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇక ఈ ప్రాజెక్ట్ కైపర్ కింద ప్రయోగించబోయే ఉపగ్రహాలు భూమి తక్కువ కక్ష్యలో (LEO) పనిచేస్తాయి. ఇవి ఇంటర్నెట్ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఉండగా, ముఖ్యంగా ఇంకా వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడమే వీరి ప్రయత్నం. ఈ ఉపగ్రహాలు మరింత వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్‌ను అందిస్తాయి.

Read Also: Thunderbolt: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ప్రాజెక్ట్ కైపర్ కింద అమెజాన్ మొత్తం 3,200 ఉపగ్రహాలను ప్రయోగించాలనుకుంటోంది. ఇది స్పేస్-x స్టార్‌లింక్ ప్రాజెక్ట్ తరహా విధానం ప్రకారం ఉంటుంది. రాబోయే కాలంలో, ఈ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి అమెజాన్ మరిన్ని లాంచ్‌లను చేయనుంది.