Amazon Project Kuiper: తొలి ఇంటర్నెట్ ఉపగ్రహాల కోసం ప్రాజెక్ట్ ‘కైపర్’ను సిద్ధం చేసిన అమెజాన్
- ప్రాజెక్ట్ 'కైపర్' కింద 27 కొత్త ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి సిద్దమైన అమెజాన్
- ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం.
- ఏప్రిల్ 10న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రయోగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Project Kuipe: అమెజాన్ తన ప్రాజెక్ట్ ‘కైపర్’ కింద 27 కొత్త ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ఏప్రిల్ 10న యునైటెడ్ లాంచ్ అలయన్స్ (ULA) అట్లాస్ V రాకెట్ ద్వారా జరగనుంది. ప్రాజెక్ట్ కైపర్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలలో వీటిని అందుబాటులోకి తీసుకరావడమే.
ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి జరగనుంది. ఈ ప్రయోగాన్ని భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 10న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రయోగం చేసాయనున్నారు. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు అమెజాన్, ULA అధికారిక వెబ్‌సైట్‌లు లేదా యూట్యూబ్ ఛానెల్‌లను సందర్శించి, లైవ్ స్ట్రీమ్‌ను వీక్షించవచ్చు.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
Read Also: Viral Video: అర్ధరాత్రి వంటింటి గోడపై ప్రత్యక్షమైన మృగరాజు!
ఈ ప్రయోగం ప్రత్యేకమైనది ఎందుకంటే.. ఇది ఈ సంవత్సరంలో ULA చేస్తున్న మొదటి ప్రధాన మిషన్ కాగా, దీనిలో అత్యంత బరువైన ప్రాజెక్ట్ కైపర్ పేలోడ్‌ను పంపవలసి ఉంది. ఇక, అమెజాన్ తన ఉపగ్రహాలను పెద్ద ఎత్తున మోహరించడం ఇదే మొదటిసారి. గతంలో 2023 అక్టోబరులో అమెజాన్ 2 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇక ఈ ప్రాజెక్ట్ కైపర్ కింద ప్రయోగించబోయే ఉపగ్రహాలు భూమి తక్కువ కక్ష్యలో (LEO) పనిచేస్తాయి. ఇవి ఇంటర్నెట్ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఉండగా, ముఖ్యంగా ఇంకా వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడమే వీరి ప్రయత్నం. ఈ ఉపగ్రహాలు మరింత వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్‌ను అందిస్తాయి.
Read Also: Thunderbolt: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
ప్రాజెక్ట్ కైపర్ కింద అమెజాన్ మొత్తం 3,200 ఉపగ్రహాలను ప్రయోగించాలనుకుంటోంది. ఇది స్పేస్-x స్టార్‌లింక్ ప్రాజెక్ట్ తరహా విధానం ప్రకారం ఉంటుంది. రాబోయే కాలంలో, ఈ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి అమెజాన్ మరిన్ని లాంచ్‌లను చేయనుంది.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?