NTV Telugu Site icon

iPhone 14 Price Drop: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర!

Iphone

Iphone

Discounts on Apple iPhone 14 and Apple iPhone 14 Pro at Amazon Prime Day Sale 2023: మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తమ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్ కోసం ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ తీసుకొచ్చింది. జూలై 15, 16 తేదీల్లో ఈ సేల్ కొనసాగుతుంది. జూలై 15 అర్ధరాత్రి మొదలై.. జూలై 16 అర్ధరాత్రి వరకు అమెజాన్ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా వివిధ ధరల కేటగిరీలలో 5G ఫోన్లపై అద్భుతమైన డీల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ ప్రియులకు మంచి తరుణం అని చెప్పొచ్చు.

Apple iPhone 14 Price Drop:
ఐఫోన్ 14 కోసం చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ని తక్కువ ధరకే దక్కించుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. ఇండియాలో ఐఫోన్ 14 (128GB వేరియంట్, బ్లూ) అసలు ధర రూ. 79,990 ఉంది. ప్రైమ్ డే సేల్‌లో 66,449కే లభిస్తోంది. ఇక ‘అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్’తో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. అంటే రూ. 3,325 క్యాష్‌బ్యాక్ వస్తుంది. దాంతో ఐఫోన్ 14ను రూ. 63,144కి అందుబాటులో ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10% తగ్గింపు పొందవచ్చు.

Apple iPhone 14 Pro Price Drop:
ఇండియాలో ఐఫోన్ 14 ప్రో (128GB వేరియంట్, గోల్డ్) అసలు ధర రూ. 1,29,900 ఉంది. ప్రైమ్ డే సేల్‌లోఈ ఫోన్ 1,17,999కే లభిస్తోంది. ఇక ‘అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్’తో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. ఐసీసీ లేదా ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఐఫోన్ 14 ప్రో మరింత తక్కువకు వస్తుంది. అయితే ప్రస్తతానికి ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్ లేదు. రూ. 1,49,900కి ఐఫోన్ 14 ప్రో మాక్స్ అందుబాటులో ఉంది.

Also Read: Samsung Galaxy Z Flip 5 Price: శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 ధర తెలిస్తే షాకే!

Also Read: Yashasvi Jaiswal Century: సురేశ్‌ రైనా రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు!

Show comments