Site icon NTV Telugu

Amazon-MX Player: ఎంఎక్స్‌ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన అమెజాన్‌.. రీ ఇన్‌స్టాల్‌, అప్‌గ్రేడ్‌ అవసరం లేదు!

Amazon Mx Player

Amazon Mx Player

ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ ఇండియా’ తన వీడియో స్ట్రీమింగ్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఎంఎక్స్‌ ప్లేయర్‌’ను కొనుగోలు చేసింది. సోమవారం ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ‘అమెజాన్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌’గా తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అమెజాన్‌ తన ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలందించి.. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మినీటీవీలో విలీనం చేసింది. అయితే ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం అమెజాన్ వెల్లడించలేదు.

Also Read: IND vs PAK: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్తాన్.. ఎప్పుడు, ఎక్కడంటే?

అమెజాన్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రీమియం కంటెంట్‌ను అందించడమే తమ లక్ష్యం అని అమెజాన్ తెలిపింది. ఎంఎక్స్‌ ప్లేయర్‌ సేవలను యాప్‌, అమెజాన్‌.ఇన్‌ షాపింగ్‌ యాప్‌, ప్రైమ్‌ వీడియో, ఫైర్‌ టీవీ కనెక్ట్‌డ్‌ టీవీల్లో వీక్షించొచ్చని చెప్పింది. అమెజాన్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌ విలీనం ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని పేర్కొంది. యూసర్లు యాప్‌ని రీ ఇన్‌స్టాల్‌ గానీ లేదా అప్‌గ్రేడ్‌ గానీ చేయాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో కూడా ఎంఎక్స్‌ప్లేయర్‌ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని అమెజాన్‌ తెలిపింది.

Exit mobile version