Site icon NTV Telugu

Amazon Huge Loss: ఆ కారణంతో రూ.82లక్షల కోట్ల సంపద కోల్పోయిన అమెజాన్

Amazon Huge Loss: ప్రపంచ ప్రఖ్యాత ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సంపదను భారీగా నష్టపోయింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ లక్ష డాలర్ల (సుమారు మన కరెన్సీలో రూ.82 లక్షల కోట్లు) మార్కెట్ విలువను కోల్పోయింది. తద్వారా ప్రపంచంలో లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను చేజార్చుకున్న తొలి లిస్టెడ్ కంపెనీ అమెజానే. 2021 జూలైలో ఆల్ టైం రికార్డ్ స్థాయి 1.88లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్న అమెజాన్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌.. ఈ నెల 9 (బుధవారం) నాటికి 87,900 కోట్ల డాలర్లకు పడిపోయింది.

Read Also: Nizam College Students : 50వద్దు మాకు 100కావాలని డిమాండ్ చేస్తున్న స్టూడెంట్లు

అమెరికాలో ధరలు 40ఏళ్లకు పైగా రికార్డ్ స్థాయికి పెరగడం, ఫెడ్ వడ్డీరేట్లు పెంపు, ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఈ నెల 9 నాటికి ఆ విలువ 87,900 కోట్ల డాలర్లకు పడిపోయింది. సంపద విలువ పడిపోవడంతో కంపెనీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

Read Also: K. Laxman: ఇది మూడోసారి.. రేపటి కార్యక్రమానికి కేసీఆర్ హాజరైతే మంచిది

వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేస్తోంది. రోబోటిక్ అనే విభాగాన్ని పూర్తిగా తొలగించగా, వేల మందిని తొలగించినట్టు సమాచారం. అటు మరో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా దారుణ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ కంపెనీ గడచిన ఏడాది కాలంలో 88,900 కోట్ల డాలర్ల మేర నష్టపోయింది. ఆదాయం పరంగా చూస్తే అమెరికాలోని టాప్ 5 కంపెనీలు ఒక్క ఏడాదిలో 4 లక్షల కోట్ల డాలర్ల మేర మార్కెట్ సంపదను కోల్పోయాయి. ఇందుకు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కూడా తోడవడంతో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

Exit mobile version