Amazon Great Indian Festival Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ పండగ వేళ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ప్రతి ఏడాది నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ తేదీలను అమెజాన్ ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. మరో ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ‘బిగ్ డేస్ సేల్’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో కొనుగోలుదారులు పండగ చేసుకోనున్నారు.
Also Read: Viral Video: 360 డిగ్రీలు తిరిగే శివలింగం.. ఎక్కడో తెలుసా?
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. మరోవైపు అమెజాన్ పే యూపీఐపై కూడా డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. రూ.1000 పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్ వస్తుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఐతే వీటిపై ఎంత డిస్కౌంట్ ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు. త్వరలో అన్ని వివరాలను అమెజాన్ పేర్కొననుంది.