Site icon NTV Telugu

Amazon Offers: అమెజాన్‌లో 80 శాతం వరకు తగ్గింపు.. డెడ్ చీప్‌గా స్మార్ట్‌ఫోన్‌లు!

Amazonindia

Amazonindia

దీపావళి 2025కి ముందుగానే ‘అమెజాన్’ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అమెజాన్ సైట్ బ్యానర్‌పై లిస్ట్ చేయబడిన వివరాల ప్రకారం.. సేల్ సమయంలో 80 శతం వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు సహా దీపావళి గిఫ్ట్‌లపై అనేక ఆఫర్‌లు ఉన్నాయి. సెప్టెంబర్ 23న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పుడు.. దీపావళి స్పెషల్‌గా వచ్చింది.

దీపావళి స్పెషల్‌ సేల్‌లో డీల్స్, డిస్కౌంట్‌లు సవరించబడ్డాయి. దీపావళి బహుమతులు, ఇతర వస్తువులపై డిస్కౌంట్లు 80 శతం వరకు ఉన్నాయి. ఈ సేల్ సమయంలో వినియోగదారులు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. దాంతో అదనపు డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ఉపయోగించి 10 శాతం వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. సేల్ సమయంలో కొన్ని గాడ్జెట్‌లపై గణనీయంగా తగ్గింపులు ఉన్నాయి. ఈ జాబితాలో ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, మౌస్‌లు, కీబోర్డ్‌లు, సెల్ఫీ స్టిక్‌లు, మొబైల్ స్టాండ్‌లు ఉన్నాయి. చాలా ఉత్పత్తులు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి.

Also Read: Karwa Chauth Shock: కర్వా చౌత్ రాత్రి ఊహించని ఘటన.. భర్తల ఇళ్లలే దోచేసిన 12 మంది నూతన వధువులు!

అమెజాన్ సేల్‌లో భాగంగా విమాన టిక్కెట్ బుకింగ్‌లపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపు ఉన్నట్లు ఒక బ్యానర్ ఉంది. అయితే కొన్ని షరతులు వర్తించనున్నాయి. అమెజాన్ సేల్ సమయంలో ఐఫోన్ 15 ఫోన్ 31 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.47,999కు కొనుగోలు చేయవచ్చు. ఇందులో టైప్-సీ కేబుల్ పోర్ట్, డ్యూయల్ రియర్ కెమెరా లెన్స్‌లు ఉన్నాయి. ఐఫోన్ 15లో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంది.

 

Exit mobile version