Amazon Layoffs: టెక్ ఇండస్ట్రీలో ఎవరి జాబులు ఎప్పుడు పోతాయో తెలియడం లేదు. ఉన్నట్లుండి ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా, అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. అయితే, కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అక్టోబర్ 28న 14,000 మందిని తగ్గించింది. తాజా రౌండ్ ఉద్యోగ కోతల్లో ప్రభావితమైన ఉద్యోగులకు, వారి తొలగింపుల్ని మెసేజ్‌ల ద్వారా అమెజాన్ తెలియజేసింది.
మంగళవారం తెల్లవారుజామున అనేక మంది అమెజాన్ ఉద్యోగులకు రెండు టెక్ట్స్ మెసేజులు వచ్చాయి. వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలియజేశాయి. ఒక మెసేజ్‌లో ఉద్యోగులు ఆఫీస్‌కు వెళ్లే ముందు వారి వ్యక్తిగత లేదా ఆఫీస్ ఈమెయిల్ చెక్ చేసుకోవాలని సూచించింది. అదే సమయంలో, వారి ఉద్యోగం గురించి ఈమెయిల్ కోసం ఇంకా ఎదురుచూస్తున్న వారు గైడెన్స్ కోసం హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని ఫాలో అప్ మెసేజ్‌లో కోరింది.
ఈ ఈమెయిల్‌లు ఉద్దేశం ఏంటంటే, ఉద్యోగం పోయిన సిబ్బంది ఆఫీసులో కనిపించడం ఇబ్బందికరంగా ఉంటుందని, వారి బిల్డింగ్ పాసులను అప్పటికే స్విచ్ ఆఫ్ చేయడాన్ని గ్రహించేందుకు ఈ ఈమెయిల్‌లు సహకరిస్తాయని సోర్సెస్ చెబుతున్నాయి. ఇటీవల కాలంలో టెక్ లేఆఫ్స్ ఎక్కువ అయిన తర్వాత, ఉద్యోగం పోయిందని తెలియని ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి, వారి ఎంట్రీ పాసులు పనిచేయడం లేదని గ్రహించడం జరిగింది. ఇలాంటి ఇబ్బందుల్ని తగ్గించేందుకే ఎర్లీ మార్నింగ్ అమెజాన్ తన ఉద్యోగులకు టెక్స్ట్ మెసేజుల్ని పంపింది. ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ స్థానాలనున పొందడంతో పాటు మరిన్ని సాయాలు చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని చెబుతోంది.
