ఇయర్ ఎండ్ సేల్ ను అన్ని ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి.. నిన్నటివరకు ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.. ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా టాప్ బ్రాండ్స్ మొబైల్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది.. అందులో వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి సరికొత్త మోడల్‌లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ డీల్ ముగింపు తేదీని కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. అయితే, కస్టమర్‌లు రూ. 9,999 కన్నా తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. రూ. 1,383 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లను కూడా అందిస్తుంది..
అమెజాన్ అందిస్తున్న టాప్ బ్రాండ్ లో ఆపిల్ ఐఫోన్ 13 ఒకటి. ఇందులో ఎ15 బయోనిక్ చిప్‌సెట్, 6.1-అంగుళాల సూపర్ ఉన్నాయి. రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, వెడల్పు, అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన డ్యూయల్ 12ఎంపీ బ్యాక్ కెమెరా సెన్సార్, 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో కూడా వస్తుంది.. అలాగే మరో టాప్ బ్రాండ్ వన్ ప్లస్ ఫోన్ల పై కూడా అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించారు..
అంతేకాదు శాంసంగ్ ఫోన్‌లు కూడా తక్కువ ధరలకు పొందవచ్చు. శాంసంగ్ మోడల్‌లలో ఒకటి గెలాక్సీ ఎమ్34 5జీ, 5ఎన్ఎమ్ ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ, 6.6-అంగుళాల పూర్తి-హెచ్‌డీ తో వస్తుంది.. మంచి వెరియంట్స్ లలో ఈ ఫోన్లు లభిస్తున్నాయి.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది.. అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.. ఇక కెమెరా విషయానికొస్తే పండగే.. అదిరిపోయేలా ఉన్నాయి.. భారీ తగ్గంపుతో వస్తున్న ఈ ఫోన్లను కొనుగోలు చెయ్యండి..
