NTV Telugu Site icon

Magical Stumping: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ఘటన.. మీరే చూసేయండి (వీడియో)

Nepal Cricket League

Nepal Cricket League

నేపాల్ ప్రీమియర్ లీగ్ (NPL)లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈరోజు కర్నాలీ యాక్స్, ఫార్ వెస్ట్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. కర్నాలీ జట్టు బ్యాటర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సన్నివేశం కనపడింది. కర్నాలీ బ్యాట్స్‌మెన్‌ స్టంప్‌ ఔట్‌ అయ్యే మూమెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బంతి వైడ్‌గా వెళ్లిందనుకున్న బ్యాట్స్‌మన్ కూడా ఆశ్చర్యపోయాడు. వైడ్ వెళ్లిందనుకున్న బ్యాటర్ పరుగు తీయడానికి పరిగెడుతాడు. కానీ వికెట్ కీపర్ బంతిని స్టంప్స్‌కు కొడుతాడు. అంతకుముందు.. ఆన్-ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వైడ్‌గా ఇస్తాడు. అదే సమయంలో స్క్వేర్ లెగ్ అంపైర్ ఔట్ అని ప్రకటిస్తాడు.

Read Also: CM Chandrababu : పోలవరం.. రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది

ఫార్ వెస్ట్ జట్టు బౌలర్ హిమ్మత్ సింగ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో.. ఈ సన్నివేశం జరిగింది. బాల్ ఆన్‌సైడ్‌కి వెళ్లడంతో బంతిని వైడ్‌గా ఫ్రంట్ అంపైర్ ప్రకటించాడు. అయితే కొద్ది క్షణాల్లోనే స్క్వేర్ లెగ్ అంపైర్ వేలి పైకెత్తాడు. ఇంతలో ఏం జరిగిందంటే.. బ్యాట్స్‌మెన్ బిపిన్ శర్మకు బంతి ఎక్కడ ఉందో తెలియదు. బంతి వికెట్ కీపర్ గ్లోవ్స్‌లో లేదు.. దీంతో బ్యాటర్ రన్‌కు పరుగెత్తే ప్రయత్నం చేస్తాడు. బంతి మాత్రం వికెట్ కీపర్ కాళ్ళ మధ్య ఇరుక్కుపోయి ఉంటుంది. ఈ క్రమంలో.. బ్యాటర్ బిపిన్ క్రీజు నుంచి బయటకు రాగానే వికెట్ కీపర్ వెంటనే స్టంప్‌లను కొడుతాడు.

Read Also: Chido Cyclone: ఫ్రాన్స్‌లో తుఫాను విధ్వంసం.. మరో అణుయుద్ధం తలపించేలా..!

స్క్వేర్ లెగ్ అంపైర్ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడానికి కారణం ఇదే. బ్యాట్స్‌మన్ క్రీజు బయట ఉండటం కనిపిస్తుంది. దీంతో.. వికెట్ కీపర్ తెలివితేటలు, చురుకుదనంతో అతన్ని ఔట్ చేస్తాడు. ఈ క్రమంలో కికెట్ అభిమానులు.. వికెట్ కీపర్‌ను ప్రశంసిస్తున్నారు. అంతే కాకుండా.. ఈ వికెట్ కీపర్ జెర్సీ పసుపు రంగులో ఉండటంతో.. అభిమానులు అతనిని MS ధోనితో పోలుస్తున్నారు. ఎందుకంటే.. ధోనీ కూడా వికెట్ కీపర్ చేసినప్పుడు ఇలాంటి మ్యాజిక్‌లు చేస్తుండేవాడు.