Bopparaju Venkateswarlu: మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చలు ముగిసిన తర్వాత.. ఒక్కో ఉద్యోగ సంఘం స్పందన ఒకోలా ఉంది.. సమావేశంపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తే.. మరికొందరు ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. సచివాలయంలో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. చట్ట బద్దంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు.. రూ. 1800 కోట్ల బకాయిలు ఇంకా ఇవ్వాలన్న ఆయన.. అవి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.. పీఆర్సీ అరియర్ లు కూడా ఎంత ఇవ్వాలో లెక్కలు చూస్తామని అధికారులు చెప్పారు.. పోలీసులు, వైద్యశాఖలో పని చేస్తున్న వారికి ఇచ్చే స్పెషల్ పేలకు కాల పరిమితి వద్దని చెప్పామన్నారు.. ఇక, కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లులో 16 శాతం హెచ్ఆర్ఏ ఉత్తర్వులు ఇవ్వాలని కోరామన్నారు.. అయితే, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకూ మా ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదు.. రేపు జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశం యథావిథిగా కొనసాగుతుందని.. మా ఉద్యమ ఫలితంగానే 5860 కోట్ల బకాయిల డబ్బులు ఇచ్చారని తెలిపారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు.
Read Also: MLA Jagga Reddy : ఇంచార్జీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
కాగా, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి స్పందన మాత్రం మరోలా ఉంది.. ఈ సమావేశం చాలా ఫలవంతంగా జరిగిందన్నారు.. మార్చి నెలలో హామీ ప్రకారం ఈ నెలాఖరు లోగా ప్రభుత్వం 3 వేల కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం అని చెప్పారన్నారు.. చెప్పిన దాని కంటే ప్రభుత్వం ఎక్కువే చెల్లించింది.. మొత్తం 5,820 కోట్లు చెల్లించారు.. సీపీఎస్ 2443 కోట్లు.. టీఏ, డీఏలు 239 కోట్లు .. పెండింగ్ ఈఎల్స్ 1600 కోట్లు .. జీపీఎఫ్ 2110 కోట్లు .. గ్రాట్యుటీ 289 కోట్లు .. మెడికల్ రీయింబర్స్మెంట్ 69 కోట్లు .. ఈఎల్ ఎన్ క్యాష్ మెంట్ 118 కోట్లుగా ఉందని వెల్లడించారు.. పెండింగ్ డీఏ ఒకటి ఈ నెలలో ఇస్తాం అని చెప్పారన్న ఆయన.. త్వరలో జీవో జారీ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2004 కు ముందు సెలెక్ట్ అయి తర్వాత జాయిన్ అయిన వారిని ఓపీఎస్ కిందకు తీసుకుని వస్తాం అని హామీ ఇచ్చారని తెలిపారు.. మంత్రి మండలి సమావేశంలో ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారన్నారు.. 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని అడిగాం.. మంత్రి వర్గ ఉప సంఘం సానుకూలంగా స్పందించిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు.