ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది అమరావతి JAC..ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు కార్యాచరణ విడుదల అయింది. మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణలో ఉన్నాము. కారుణ్య నియామకాలు జరగాల్సిన ఉన్న కుటుంబా లను పరామర్శ చేస్తాం.
ఈ నెల 11న సెల్ డౌన్ ఆందోళన ఉంటుందన్నారు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. మంత్రి వర్గ ఉప సంఘం లో మంత్రులు వాళ్లు చెప్పాల్సిన రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయారు.ఉద్యమం కొనసాగిస్తామని మంత్రి వర్గ ఉపసంఘం భేటీ తర్వాత కూడా చెప్పాం.PRC ఎరియర్స్ వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
8 ఏళ్లుగా ఉద్యోగుల హెల్త్ ను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ చెల్లింపులు సరిగా లేకపోవటం వల్ల వైద్యం నిరాకరణ చేస్తున్నారు. ప్రధాన సమస్యలు ఏవీ ఇప్పటి వరకు పరిష్కారం అవలేదు. ఒకటో తేదీన జీతాలు పడితే చాలు అనే పరిస్థితికి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు.జీతాలు సక్రమంగా చెల్లింపులు జరపలేక పోవటం ఎవరి విఫలమో చెప్పాలన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వటం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రికమెండ్ చేసిన పే సేల్స్ ఎందుకు ఇవ్వటం లేదో ప్రభుత్వం చెప్పాలి.2015 పాత పే స్కేల్ మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమ డిమాండ్ల సాధనకు రెండో దశ కార్యచరణ ప్రకటించింది అమరావతి జెఎసి.ఈనెల 5 వ తేది నుంచి 29 తేది వ వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరుకానున్నారు.
Read Also: Ideas for India: మంత్రి కేటీఆర్‌కు మరో గౌరవం.. బ్రిటన్ సదస్సుకు ఆహ్వానం
8 వ తేదీన నల్ల కండువాలు ముఖ్య కూడళ్లలో నిరసన ఉంటుంది. 10 వ తేదీన గ్రీవెన్స్ డే రోజున స్పందనలో కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించడం. 11వ తేదీన సెల్ డౌన్ కార్యక్రమం. 12వ తేదీన 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా. 15 వ తేదీన మరణించిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించడం. 18వ తేదీన సిపియస్ ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చేపడతామన్నారు. 20 వ తేదీన జీతాలు సకాలంలో చెల్లించాలని పెనాల్టిల నుంచి విముక్తి కలిగించాలని బ్యాంకుల సందర్శన. 25 వ తేదీన 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ధర్నా ఉంటుందన్నారు. 27వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పరామర్శ కార్యక్రమం ఉంటుందన్నారు. 29 వ తేదీన గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతామన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.
వారంలో CPS రద్దు చేస్తామని చెప్పారు, ఎప్పటికీ ఈ వారం వస్తుందో చెప్పాలి. లోక్ సత్తా జయప్రకాష్ ఉద్యోగుల పెన్షన్ల పై చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఎమ్మెల్యే, ఎంపీ చేసిన వారందరికీ మాత్రం రెండు మూడు ఫించన్లు తీసుకునేందుకు సిద్దమవడం దేనికి నిదర్శనం. CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. CPS రద్దు రాష్ట్ర పరిధిలో అంశమే అని మరోసారి స్పష్టం చేస్తున్నాం. మే 1 ఉద్యోగులు చేపట్టనున్న కార్యక్రమానికి మా మద్దతు ఉంటుందన్నారు.
Read Also: Harish Rao : ఇంత మంచి పని చేసిన కేసీఆర్‌ని సాదుకుందామా.. సంపుకుందమా..?
