Site icon NTV Telugu

Pawan Kalyan: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సెక్రటేరియట్ కు పవన్‌..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు.. ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఆయన సెక్రటేరియట్‌కి రాబోతున్నారు.. అయితే, ఏడేళ్ల తర్వాత సచివాలయానికి వస్తున్నారు పవన్‌.. 2017 జులైలో ఉద్దానం సమస్యల పరిష్కారంపై అప్పటి సీఎం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయ్యారు.. ఇక, ఏడేళ్ల తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో సెక్రటేరియట్‌కు వస్తున్నారు.. మరోవైపు.. సచివాలయానికి వస్తున్న పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు.. గతంలో అమరావతి రైతుల కోసం ముళ్ల కంచెలు దాటుకుని వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు జనసేన అధినేత.. ఇప్పుడు ఆయన కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు దక్కించుకుని.. పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్న తరుణంలో.. అమరావతి రైతులు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం భారీ ఎత్తున పూలను సమీకరించారు..

Read Also: B. Vinod Kumar: బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది..!

కాగా, సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి వస్తున్న తరుణంలోనూ అమరావతి రైతులు పూల వర్షం కురిపిస్తూ.. ఆయనకు స్వాగతం పలికిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పబోతున్నారు. మరోవైపు.. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్న పవన్‌ కల్యాణ్‌.. తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయానికి పరిశీలించారు.. అక్కడ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు ఆయనికి స్వాగతం పలికారు.. అనంతరం పరిచయం చేసుకున్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.. ఇక, రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు పవన్‌ కల్యాణ్‌.. అయితే, ఈ రోజే సచివాలయానికి వెళ్లి.. తన ఛాంబర్‌ను పరిశీలించబోతున్నారు.

Exit mobile version