NTV Telugu Site icon

Amanchi Srinivasa Rao: జనసేనలోకి ఆమంచి సోదరుడు.. నేడు పవన్‌ సమక్షంలో చేరిక

Amanchi Srinivasa Rao

Amanchi Srinivasa Rao

Amanchi Srinivasa Rao: వారాహి యాత్రతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హీట్‌ పెంచారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. మరోవైపు.. వివిధ పార్టీలకు చెందిన నేతలు జనసేన గూటికి చేరుతున్నారు.. వారాహి 1, వారాహి 2 యాత్రల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పలువురు నేతలు.. జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిపిందే కాగా.. ఇప్పుడు జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహషన్‌ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్‌ స్వాములు.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు ఆమంచి శ్రీనివాసరావు.. ఇక, ఆయనకు సంఘీభావంగా పలు నియోజకవర్గాలకు చెందిన కాపు సామాజిక వర్గ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Read Also: OTT: అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ ఉంటే అంతే సంగతులు.. ఓటీటీకు ప్రభుత్వం వార్నింగ్‌..

కాగా, ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరబోతారనే వార్తలో అప్పట్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో హాట్ టాపిక్‌ అయ్యాయి.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించగా.. దానిని విజయవంతం చేయాలని కోరుతూ జనసేన శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోతోపాటు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు ఫొటో ఉండడం అప్పట్లో సంచలనంగా మారింది.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. నిజంగా శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరుతున్నారా..? లేక ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఫొటోలను ఏర్పాటు చేశారనే అనే చర్చ సాగింది.. కానీ, ఈ రోజు ఆమంచి శ్రీనివాసరావు.. జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు..

Show comments