Site icon NTV Telugu

Amalapuram: ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

Amalapuram

Amalapuram

Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జిపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. ఈ దాడిలో 5 ల్యాప్ ప్టాప్ లు, 75 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్ బుక్ లు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Wayanad landslides: వయనాడ్ విలయంపై శాస్త్రవేత్తల అనుమానాలివే..!

ఇక, నిందితులది అమలాపురం మండల పరిధిలోని భట్లపాలెం గ్రామానికి చెందిన మోటూరి దొర సత్య, సూర్య మణికంఠ (నాని), మోటూరి మధు పవన్ (సతీష్), అలాగే, కైకలూరు గ్రామం, కృష్ణా జిల్లాలోని కైకలూరు గ్రామానికి చెందిన భలే ప్రవీణ్ బాబు, భీమవరానికి చెందిన గునుపూడి గ్రామవాసి పంజా సాయి నరసింహ (నాని), గురజాపు సూర్య ప్రభు (సూర్య) పోలీసులు అరెస్టు చేయగా.. పరారీలో మరో ఇద్దరు నిందితులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version