Site icon NTV Telugu

Always Shubhu Baby: హార్దిక్, శుభ్‌మన్ గిల్ మధ్య గొడవ.. “ఆల్వేస్ శుభూ బేబీ” అంటూ..!

Hardik Pandya

Hardik Pandya

Always Shubhu Baby: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య గ్రౌండ్‌లో ఉద్రికత్త స్పష్టంగా కనిపించింది. టాస్ దగ్గర నుంచే ఇద్దరి మధ్య బాడీ లాంగ్వేజ్‌లో తేడా కనిపించడంతో పాటు శుభ్‌మన్ ఔట్ అయిన తర్వాత హార్దిక్ త‌న భావాలను ఆగ్రహంగా వ్యక్తపరిచిన తీరు అభిమానుల్లో అనుమానాలు కలిగించింది. అయితే, మ్యాచ్ అనంతరం గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “నథింగ్ బట్ లవ్” అంటూ హార్దిక్‌కి డెడికేట్ చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. దీనిని హార్దిక్ పాండ్యా తన అకౌంట్‌లో షేర్ చేస్తూ, “ఆల్వేస్ శుభూ బేబీ” అనే మూడు పదాల కామెంట్ పెట్టాడు. ఈ స్పందనతో ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టమైంది.

Read Also: Asaduddin Owaisi: ‘ఉగ్రవాది లఖ్వీ జైలులో ఉండగా తండ్రయ్యాడు’.. ఉగ్రవాదంలో పాక్ ప్రమేయాన్ని వివరించిన ఓవైసీ

ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్‌ను టోర్నీ నుంచి బయటకు నెట్టింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ నేడు (జూన్ 1)న అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు జూన్ 3న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ ఆడనుంది.

Read Also: Corona: దేశంలో 3000 దాటిన కరోనా కేసులు.. తమిళనాడులో యువకుడు మృతి

Exit mobile version