Site icon NTV Telugu

Muhajir in Pakistan: ‘ప్లీజ్ భారత్ నుంచి వచ్చిన వలసదారులను రక్షించండి’.. పాక్ నాయకుడు పీఎం మోడీకి విజ్ఞప్తి

Altaf Hussain

Altaf Hussain

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, బహిష్కృత పాకిస్తాన్ నాయకుడు, ముత్తహిదా క్వామీ ఉద్యమం (MQM) వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి సహాయం కోరాడు. ఉర్దూ మాట్లాడే శరణార్థులు, అంటే దేశ విభజన తర్వాత భారత్ నుంచి వచ్చి పాకిస్తాన్‌లో స్థిరపడిన ముహాజీర్‌లను హింసించే అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.

Also Read:Jailer2 : రజనీకాంత్‌కి విలన్‌గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్‌రా మామ

తన ప్రకటనలో.. బలూచ్ ప్రజలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోడీని ఆయన ప్రశంసించారు. దీనిని సాహసోపేతమైన, నైతికంగా ప్రశంసనీయమైన చర్యగా అభివర్ణించారు. ముహాజిర్ సమాజానికి కూడా ఇలాంటి మద్దతు కోసం స్వరం పెంచాలని ఆయన ప్రధాని మోడీని అభ్యర్థించారు. ముహాజీర్లు దశాబ్దాలుగా అణచివేత, వివక్షను ఎదుర్కొంటున్నారని అల్తాఫ్ చెప్పారు. భారత్ నుంచి విడిపోయినప్పటి నుంచి పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ముహాజీర్లను దేశ చట్టబద్ధమైన పౌరులుగా పూర్తిగా అంగీకరించలేదని ఆయన అన్నారు. ఈ అణగారిన వర్గాల హక్కులను MQM నిరంతరం సమర్థించింది. కానీ పాక్ సైనిక చర్య ఇప్పటివరకు 25,000 మందికి పైగా ముహాజీర్ల మరణానికి దారితీసిందని అన్నారు.

Also Read:Jailer2 : రజనీకాంత్‌కి విలన్‌గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్‌రా మామ

అమెరికాలోని హ్యూస్టన్‌లోని పాకిస్తాన్ కాన్సుల్ జనరల్ అఫ్తాబ్ చౌదరి ఈ కార్యక్రమంలో అల్తాఫ్, ఎంక్యూఎంలను భారతదేశ ఏజెంట్లుగా చూపించిన వీడియోను ప్రదర్శించారని అల్తాఫ్ హుస్సేన్ చెప్పారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ముహాజీర్ల గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లో ముహాజీర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోడీ ఈ వలసదారుల గొంతుకను వినిపించాలని, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ సమాజంలోని ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ఆయన కోరారు.

Exit mobile version