Site icon NTV Telugu

Pushpa 2 Teaser: 68 సెకండ్ల టీజర్.. చీరలో అల్లు అర్జున్!

Allu Arjun Pushpa 2

Allu Arjun Pushpa 2

Allu Arjun in Saree in Pushpa 2 The Rule Teaser: లెక్కల మాస్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం దక్కేలా చేయడమే కాకుండా.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలిపింది. పుష్పరాజ్‌గా ప్రేక్షకుల గుండెల్లో ఐకాన్ స్టార్ నిలిచిపోయాడు. ‘పుష్ప ది రూల్‌’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ వస్తున్నాడు.

ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుండగా.. నేడు అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు. టీజర్ 68 సెకండ్ల నిడివి ఉంటుందని తెలుస్తోంది. తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో 68 సెకండ్ల టీజర్ కట్ చేశారట. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ అందరిని ఆకట్టుకునేలా టీజర్ ఉంటుందని తెలుస్తోంది. టీజర్లో అల్లు అర్జున్ చీర కట్టులో కనిపిస్తాడని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో పుష్ప 2 టీజర్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version