NTV Telugu Site icon

Allu Arjun : కూతురితో అల్లు అర్జున్.. క్యూట్ వీడియో

Allu

Allu

Allu Arjun : సినిమాలతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన పిల్లలతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. ఆ వీడియోల్లో తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అల్లు అర్జున్ తన కూతురు అర్హల వీడియోలకు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ ఉంది. ఆ వీడియోలను చూసి నెటిజన్స్ వారికి ఫిదా అయిపోతారు. ఈ ఇద్దరూ కలిసి చేసే వీడియోలకు కూడా భారీ ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. వీరి కాంబోలో మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Read Also: Video Viral : బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. భయంతో జనం పరుగోపరుగు

అల్లు అర్జున్ అర్హతో కలిసి కారులో వెళ్తూ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అర్హ అల్లు అర్జున్ ఒడిలో కూర్చుని ఉంది. తన చేతులతో ముఖాన్ని కనిపించకుండా చేసింది. దాంతో అల్లు అర్జున్ తన చేతులను తీయడానికి ప్రయత్నించగా అర్హ వద్దంటూ ప్రతిఘటించింది. ఇలా కాసేపు ఇద్దరూ అల్లరి చేశారు. ఈ వీడియోను బన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. అభిమానులు వీరి అల్లరిని చూసి ముచ్చట పడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ పుష్ప2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు.

Read Also:Poonch Attack: పూంచ్ ఉగ్రదాడి మా పనే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన..

Show comments