Site icon NTV Telugu

Allu Arjun: వరల్డ్ బెస్ట్ ఫాదర్.. బన్నీ ట్వీట్ వైరల్

Bunny

Bunny

Allu Arjun: ప్రపంచంలో ఎవరికైనా మొదటి హీరో నాన్ననే. చిన్నతనం నుంచి కొట్టినా, తిట్టినా.. ఆయన మీద ఉండే గౌరవం ఎప్పటికి పోదు. ఒక మనిషి ఉన్నతస్థానానికి వెళ్ళాడు అంటే అందులో ఎంతోకొంత అతని తండ్రి కష్టం కచ్చితంగా ఉంటుంది. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తమ మొదటి హీరోల గురించి, వారితో తమకున్న అనుబంధాల గురించి చెప్పుకొస్తున్నారు. ఇక ఈ బంధాలకు హీరోలు మాత్రం అతీతులేం కాదు. తామ తండ్రులే తమకు హీరోలు అంటూ హీరోలు సైతం ఫాదర్స్ డే శుబాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన తండ్రి అల్లు అరవింద్ కు ఫాదర్స్ డే విషెస్ చెప్తూ.. ” ప్రపంచంలో ఉన్న అందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. స్పెషల్ గా వరల్డ్ బెస్ట్ ఫాదర్ కు” అంటూ రాసుకొచ్చాడు. ఇక అల్లు అర్జున్ సినిమాస్ ఓపెనింగ్ రోజున అల్లు అరవింద్ తో దిగిన ఫోటోను షేర్ చేశాడు బన్నీ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Suriya: రాజకీయాల్లోకి సూర్య..?

గంగోత్రి సినిమాతో బన్నీ తన కెరీర్ ను మొదలు పెట్టాడు. అల్లు అరవింద్ తన కొడుకు హీరో అవుతాడు అని ఏరోజు అనుకోలేదట. కానీ, ఈరోజు ఐకాన్ స్టార్ గా బన్నీ ఎదగడం చూసి ఎంతో సంతోషపడినట్లు ఎప్పుడు చెప్పుకొస్తాడు. అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య.. ఆయనను హీరోగా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ, అల్లు అరవింద్ కు నిర్మాతగా మారాలని ఉండడంతో ఆ కోరికను బన్నీ తీర్చి.. తాతగారి పేరు నిలబెట్టినట్లు చెప్పుకొస్తాడు. సాధారణంగా ఏ హీరోకు అయినా .. హిట్లు, ప్లాపులు కామన్ గానే వస్తాయి. హిట్లు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ప్లాపులు వచ్చినప్పుడు కుంగిపోకుండా వారిని నిత్యం కంటికి రెప్పలా కాపాడుకొనేవాడే తండ్రి. అందులో అల్లు అరవింద్ ముందు ఉంటాడు. ఇక బన్నీ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారడం వెనుక అల్లు అరవింద్ అసలైన ఆయుధం. ఆయనే బన్నీకి దైర్యం. ఈ విషయాన్ని బన్నీ సైతం ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Exit mobile version