NTV Telugu Site icon

Super Star Of The Year : ‘సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ ఎవరికి దక్కుతుందో తెలుసా ?

Allu Arjun News

Allu Arjun News

Super Star Of The Year : టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజన్ కు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు అగ్ర హీరోలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గుంటూరు కారం, కల్కి 2898 ఏడీ, దేవర-1, పుష్ప-2 వంటి సినిమాలతో థియేటర్లలో సందడి చేశారు. ఈ చిత్రాలకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఆధారంగా వీరిలో ‘సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచిన హీరో ఎవరో ఈ కథనంలో చూద్దాం.. మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా మహేష్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించారు. 10 రోజుల్లోనే 230 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు కానీ, ఒరిజినల్ గా ఫైనల్ రన్ లో 172 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు సమాచారం. కాకపోతే ఈ సినిమాకి ఓటీటీలో అనూహ్య స్పందన వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో కొన్ని వారాల పాటు గ్లోబల్ ట్రెండింగ్ లిస్టులో గుంటూరు కారం నిలిచింది.

Read Also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

తర్వాత ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ ”కల్కి 2898 AD”. ఇందులో అగ్రనటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే కీలక పాత్రల్లో నటించారు. జూన్ ఆఖర్లో వచ్చిన ఈ చిత్రం ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర 1’ సినిమా సెప్టెంబర్ ఆఖర్లో రిలీజ్ అయింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయినా సరే ఎన్టీఆర్ స్టార్ డమ్ తో రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు లేటెస్టుగా అల్లు అర్జున్ హీరోగా నటించిన “పుష్ప 2: ది రూల్” విడుదలైంది. సుకుమార్ డైరెక్షన్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించినట్లుగానే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. మూడు రోజులు తిరక్కుండానే 500 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి, అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఇండియన్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది.

Read Also: December 9th Incarnation Festival: ఏటా డిసెంబరు 9న అవతరణ ఉత్సవం.. అసెంబ్లీలో సీఎం ప్రకటన..

ఇలా 2024లో నలుగురు పెద్ద హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగారు. వారిలో ప్రభాస్, అల్లు అర్జున్ టాప్ లో ఉన్నారు. కాకపోతే ‘కల్కి 2898 AD’ సక్సెస్ లో డార్లింగ్ తో పాటుగా అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్లకు కూడా భాగం ఉంది. ఇక్కడ ‘పుష్ప 2’ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సోలోగా బన్నీకే దక్కుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే RRR & కల్కి రికార్డులు కూడా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నార్త్ లో మూడు రోజుల్లోనే 205 కోట్లు సాధించి బాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘పుష్ప 2’ కేవలం హిందీలో 1000 కోట్లు రాబడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ‘సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ అల్లు అర్జున్ అనే చెప్పాలి.