Site icon NTV Telugu

AA23 Sensation: 1 మిలియన్ రీల్స్‌తో ఐకాన్ స్టార్.. ‘23 థీమ్’ రికార్డు!

Aa23 Sensation

Aa23 Sensation

టాలీవుడ్ సెన్సేషన్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలైన వీరి క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టింది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే, ఈ చిత్రం సరికొత్త చరిత్రను లిఖించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందించిన #23Theme మ్యూజిక్ ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.

Also Read : Alia Bhatt :79వ బాఫ్టాలో ప్రెజెంటర్‌గా ఆలియా అరుదైన గౌరవం..

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యూజిక్ (OST) ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) మార్కును దాటింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో కేవలం ఒక అనౌన్స్‌మెంట్ థీమ్ ఈ స్థాయిలో రీల్స్ సాధించడం ఇదే మొదటిసారి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ బన్నీ లోకేష్ ల అరుదైన ఫోటోను షేర్ చేశారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు, అది ముగిసిన వెంటనే 2026 చివరలో ఈ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు,హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు ‘స్ట్రైవ్ ఫర్ గ్రేట్‌నెస్’ (Strive for Greatness) అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 

Exit mobile version