భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది, అదే “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేతులు కలపబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్మెంట్ రావడంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను మరింత భారీగా మార్చే అంశం ఏమిటంటే, ఇందులో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతుండటం, లోకేష్ మేకింగ్, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, దానికి తోడు అనిరుధ్ ఇచ్చే అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఈ మూడూ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:Chiranjeevi :సంక్రాంతికి ‘మెగాస్టార్’ను కొట్టేవాడే లేడు.. అన్‌స్టాపబుల్ ‘మన శంకర వరప్రసాద్ గారు’!
ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం సౌత్ అనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఆయనకు తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది. లోకేష్ కనగరాజ్ వంటి డైరెక్టర్‌తో సినిమా అంటే అది కేవలం ఒక సినిమా కాదు, అతని ట్రాక్ రికార్డ్ చూస్తే అది బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డుల వేట అని చెప్పవచ్చు. ఈ సినిమాతో బన్నీ స్టార్డమ్ రెట్టింపు అవ్వడమే కాకుండా, వసూళ్ల పరంగా అందని ఎత్తుకు చేరుకోవడం ఖాయం. నిజానికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ముందు లోకేష్ కనగరాజ్ చుట్టూ ఎన్నో ఊహాగానాలు నడిచాయి. ‘కూలీ’ తర్వాత ఆయన అమీర్ ఖాన్‌తో ఒక సూపర్ హీరో సినిమా చేస్తారని ప్రచారం జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు, ఆ తర్వాత రజినీకాంత్ – కమల్ హాసన్‌లతో మల్టీస్టారర్ ఉంటుందని, ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో చర్చలు జరిగాయని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే, అన్ని సస్పెన్స్‌లకు తెరదించుతూ ఫైనల్‌గా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఖరారైంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగంగా ఈ సినిమా ఉంటుందా లేక ఇదొక ఫ్రెష్ స్టోరీనా అనే ఉత్కంఠ ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.
