Site icon NTV Telugu

Allu Arjun : గోల్డెన్‌ వీసా అందుకున్న పుష్ప రాజ్‌.. తగ్గేదెలే..

Golden Visa Allu Arjun

Golden Visa Allu Arjun

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్ వీసా తాజాగా అందుకున్నాడు పుష్ప రాజ్‌. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు అల్లు అర్జున్‌. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. దుబాయ్ దేశం ఫొటోను షేర్ చేస్తూ.. ‘నాకు ఎన్నో అనుభూతులు పంచిన దుబాయికి థాంక్స్. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అంటూ పోస్ట్ చేశాడు. సైన్స్‌, సినిమా, క్రీడా తదితర రంగాల్లో ప్రసిద్ధిగాంచిన వ్యక్తులకు 2019 నుంచి యూఏఈ గోల్డెన్‌ వీసాలను జారీ చేస్తోంది.

Also Read : MS Dhoni: ధోనీ అప్పుడే మొదలెట్టేశాడుగా.. ఫ్యాన్స్ ఖుషీ

ఇంతకుముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన షారుఖ్‌ఖాన్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, టొవినో థామస్‌ తదితరులు ఆ వీసాను పొందారు. 2021లో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్‌ ప్రస్తుతం దాని సీక్వెల్‌లో నటిస్తున్నారు. విశాఖపట్నంలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభంకానుంది. పది రోజులకు పైగా అక్కడ జరిగే షూటింగ్‌లో ఆయన పాల్గొనబోతున్నారు. వచ్చే నెలలో కథానాయిక రష్మిక సెట్లోకి అడుగుపెట్టనున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం పుష్ప-2 షూటింగ్‌లో పాల్గోనేందుకు అల్లు అర్జున్‌ విశాఖకు చేరుకున్నారు. అయితే.. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Also Read : Agricultural Growth Rate: ఏపీలో పెరిగిన వ్యవసాయ వృద్ధిరేటు.. నంబర్‌ వన్‌ టార్గెట్..

Exit mobile version