NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్‎కు షాక్.. అప్డేట్ ఇవ్వాలంటూ రోడెక్కిన ఫ్యాన్స్

Fhlxse Amaynfta

Fhlxse Amaynfta

Allu Arjun: స్టైలిష్ స్టార్ అర్జున్ కు అభిమానులు షాకిచ్చారు. పుష్క-2 సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ ఫ్లెక్సీలతో రోడెక్కారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఉత్తరాదిలో పుష్ప సినిమాకు ఊహించని స్థాయి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పుష్ప విజయం తర్వాత పుష్ప 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం పుష్ప సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుపుకుంటుంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ ఇవ్వాలంటూ బన్నీ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.

Read Also: Actress Passes Away : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను తెరపై త్వరగా చూసుకునేందుకు తగ్గేదేలే అంటున్నారు. త్వరగా తమ హీరోను తెరపైకి తీసుకురావాలని చిత్రబృందంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా పుష్ప 2 అప్డేట్ రాబోతుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ లేదు. అల్లు అర్జున్ అభిమానులు. చేతిలో బ్యానర్లు.. పోస్టర్లు పట్టుకుని పుష్ప2 అప్డేట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా నిరసన ప్రదర్శన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇవి కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, యూఏఈకి చెందిన అభిమానుల చిత్రాలు అని తెలుస్తోంది.