NTV Telugu Site icon

Allu Arjun : ” నా కేరీర్ ఒక మరపురాని ప్రయాణం “.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్..!

Bunny

Bunny

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు..

తాజాగా అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.. దుబాయ్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. ఈ ఘనతను సాధించడం పై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.

ఆ ట్వీట్ లో.. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో ఈ రోజే విడుదలైంది. ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు.. రాబోయే సంవత్సరాల్లో మీ అందరినీ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నాను.. అంటూ రాసుకొచ్చాడు.. ఆ పోస్ట్ ను ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు..

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. ఆగస్టు 15 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఆ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Show comments