Allu Arjun : ” నా కేరీర్ ఒక మరపురాని ప్రయాణం “.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు..
తాజాగా అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.. దుబాయ్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. ఈ ఘనతను సాధించడం పై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.
Also Read
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ఆ ట్వీట్ లో.. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో ఈ రోజే విడుదలైంది. ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు.. రాబోయే సంవత్సరాల్లో మీ అందరినీ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నాను.. అంటూ రాసుకొచ్చాడు.. ఆ పోస్ట్ ను ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు..
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. ఆగస్టు 15 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఆ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
It’s a very spl day today 🖤 . My 1st movie #Gangotri was released today in 2003 & today I am launching my Wax statue at #madametussauds dubai . It’s been an unforgettable journey of 21 years . I am grateful to each and every one of you in this journey & special thanks to my Fans… pic.twitter.com/kWRQemlwgi
— Allu Arjun (@alluarjun) March 28, 2024
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!